జూన్‌ 19 నుంచి శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

 జూన్‌ 19 నుంచి శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

భూమిపుత్ర, తిరుపతి:

అప్పలాయగుంటలోని శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్‌ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా జూన్‌ 15న ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. జూన్‌ 18వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు.జూన్‌ 19న ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మధ్య ధ్వజారోహణం జరుగనుంది.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.జూన్‌ 22న సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్‌ 27న ఉదయం 8.30 నుంచి10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం జరుగనుంది. అనంతరం ఉదయం 10 నుంచి 10.15 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *