కిట్టీపార్టీలతో కోట్లు దండుకున్న కి”లేడి”

 కిట్టీపార్టీలతో కోట్లు దండుకున్న కి”లేడి”

శిల్పా చౌదరి బాధితులలో సినిమా హీరోలు

పార్టీలతో ప్రముఖులకు వల

భూమిపుత్ర,హైదరాబాద్‌:

టాలీవుడ్‌ హీరోలను బోల్తా కొట్టించిన వ్యాపారవేత్త, సినీ నిర్మాత శిల్పా చౌదరీని పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్‌ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కిలాడి శిల్ప వలలో మోసపోయిన వారిలో ముగ్గురు హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. మోసపోయినవారి జాబితాలో ఇంకా వ్యాపారవేత్తలు, ఫైనాన్షియర్లు, రియల్టర్లు, లాయర్లు కూడా ఉన్నారు. డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ శిల్పపై పోలీసులకు బోలెడన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రముఖుల పేర్లు చెప్పి మరీ శిల్ప మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 200 కోట్ల వరకు వసూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు అందాల్సి ఉంది.పేజ్‌ త్రీ పార్టీ లు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూల్‌ చేసింది. సుమారు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు వారికి కుచ్చు టోపీ పెట్టిందామె.

చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసినట్లు వార్తలు అందుతున్నాయి. ఆధిక వడ్డీ ఇస్తానని చెప్పి శిల్ప కోట్లు వసూలు చేసింది. శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లధనాన్ని మార్పిస్తానని, అధిక వడ్డీ ఇస్తానని చెప్పి శిల్పి.. ప్రముఖుల్ని మోసం చేసింది. మోసపోయినవారిలో చాలా మంది బాధితులు ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. క్యూట్‌ క్యూట్‌గా కనిపిస్తున్న శిల్పా చౌదరీ మహా కిలాడి. మాయమాటలు చెప్పి కోటీశ్వరులను ఈజీగా మోసం చేసింది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్లతో పరిచయాలు పెంచుకుని అందర్నీ చీట్‌ చేసింది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూల్‌ చేసి ఆ తర్వాత కనిపించకుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్సింగ్‌ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్‌ విల్లాలో నివాసముంటున్న చౌదరి అనే మహిళ గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్‌, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు చేసింది. అక్కడికి వారిని ఆహ్వానించి వారితో పరిచయం ఏర్పాటు చేసుకుని తాను సినీ ఫీల్డ్‌ లో ప్రొడ్యూసర్‌ నంటూ నమ్మబలికి వారి నుంచి విరివిగా ఒక్కొక్కరి వద్ద కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతోంది.

శిల్పా చౌదరి వ్యవహారాన్ని గుర్తించిన రోహిణి అనే మహిళా బాధితురాలు తాను నాలుగు కోట్ల రూపాయలను శిల్పా చౌదరికి ఇచ్చి మోసపోయానని శనివారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. మంచిరేవులోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటున్నట్లు బాధితురాలు రోహిణి తెలిపారు. తనతో పాటు అనేక మంది వద్ద శిల్పాచౌదరి దాదాపు వంద కోట్లపై చిలుకు డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు తనకుకు తెలిసిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు గండిపేట లోని సిగ్నేచర్‌ అపార్ట్‌మెంట్‌ కు వెళ్లి శిల్పాను అరెస్టు చేశారు. చీటింగ్‌ కేసులో విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్‌ శివ కుమార్‌ తెలిపారు. నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కు బాధితులు తరలి వస్తున్నారని వారి వద్ద నుంచి వివరాలు సేకరించి మరింత సమాచారాన్ని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Related News

Leave a Reply

Your email address will not be published.