సాగరతీరంలో… ’సాహో’ బ్యూటీ!!

 సాగరతీరంలో… ’సాహో’ బ్యూటీ!!

భూమిపుత్ర,సినిమా:

మాల్దీవ్స్‌… ఇప్పుడు బాలీవుడ్‌ లో ఎవరి నోటా విన్నా ఇదే పర్యాటక కేంద్రం. మన టాలీవుడ్‌ సెలెబ్రిటీలు కూడా ఈ మధ్య కొందరు మాల్దీవ్స్‌ లోనే ప్రత్యక్షమయ్యారు. ఇక ఇప్పుడు అక్కడి సాగర తీరంలో సేద తీరే టైం శ్రద్దా కపూర్‌ కి వచ్చేసింది. మాగ్నిఫిషెంట్‌ బేబ్‌ మాల్దీవ్స్‌ లో మెరిసిపోతోంది! ముంబైలో కరోనా కల్లోం కొనసాగుతుండగా శ్రద్దా మాత్రం మాల్దీవ్స్‌ కు వెళ్లిపోయింది. అక్కడ హాయిగా రిలాక్స్‌ అవుతూ ఇంటర్నెట్‌ లో ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తోంది. ఆమె అందానికి, మాల్దీవ్స్‌ సొగసుకి నెటిజన్స్‌ మురిసిపోతున్నారు. హాట్‌ స్విమ్‌ సూట్‌ లుక్స్‌ తో సహా శ్రద్దా కపూర్‌ రకరకా డ్రస్సులు వేస్తూ కుర్రాళ్లని అందంగా మాయ చేస్తోంది. సొషల్‌ విూడియాలో ఆమెను ఫాలో అయ్యే యూత్‌ ’సాహో’ భామ మాల్దీవ్స్‌ అప్‌ డేట్స్‌ ను తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇప్పటికే శ్రద్దా బాయ్‌ ఫ్రెండ్‌ రోహన్‌ శ్రేష్ఠ కూడా రొమాంటిక్‌ ఐల్యాండ్‌ కి చేరుకున్నాడట. కానీ, ఇంత వరకైతే ఫోటోల్లో కనిపించలేదు. చూడాలి మరి, ఆయనతో కలిసి ఫ్యాన్స్‌ కి శ్రద్దా స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌ ఏమైనా ఇస్తుందేమో.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *