గ్రామీణ ప్రజలకు ఊతంగా ఉపాధి హామీ పథకం

 గ్రామీణ ప్రజలకు ఊతంగా ఉపాధి హామీ పథకం

గ్రామీణ ఉపాధి హామీ పథకం

భూమిపుత్ర,సంపాదకీయం:

మొదటి దశలో భారత్‌ లో పట్టణాలకే పరిమితమైన కోవిడ్‌ వ్యాధి ఉధృతి ఇప్పుడు గ్రామాలపై విరుచుకుపడుతుంది. ప్రతి గ్రామం దాదాపు 30 పడకల ఐసొలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆరోగ్య సిబ్బందికి ప్రధాని మోడీ సూచించడం ప్రమాదం ముప్పును తెలియజేస్తున్నది. ఈ మహా సంక్షోభంలో ప్రజల ప్రాణాతో పాటు వారి జీవనోపాధులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాలశాను కోవిడ్‌ కన్నెర్ర చేయడంతో వలసకూలీలతో పాటు నిరుపేద జీవన హక్కు ప్రశ్నార్థకంగా మారింది. కానీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రావిూణ ప్రజలకు నిత్యం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, వారికి ఆసరాగా నిలబడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వెన్నంటి ఉంటున్నాయి. ఈ సంక్షోభ సమయంలో ఉపాధి హామీ పథకం గ్రావిూణ నిరుపేదల పాలిట కల్పతరువులా మారింది.భారతదేశంలో 70 శాతం ప్రజలు గ్రావిూణ ప్రాంతాలలో వ్యవసాయాధారిత జీవనం కొనసాగిస్తున్నారు.

స్వాతంత్య్రానంతరం గ్రామీణ ప్రజల జీవనోపాధి గూర్చి ఎన్నో వినూత్న పథకాలను అమలు చేశారు. కానీ 2005 ఆగస్టు 23న భారత పార్లమెంట్‌ చే ఆమోదింప చేయబడిన జాతీయ గ్రావిూణ ఉపాధి హామీ చట్టం ఒక ప్రత్యేకమైన పథకం. చట్టం అమల్లోకి వచ్చాక మొదటగా 200 జిల్లాల్లో అమలు చేయబడినా, ఆపైన నూరు శాతం పట్టణ జనాభా ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాలన్నీ ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా గ్రావిూణ ప్రాంతాలో నైపుణ్యం లేని కార్మికులకు పని లేని సమయాలలో అదనపు ఉపాధి కోసం పని కల్పించడం చట్టబద్ధమైన హక్కుగా ఈ చట్టం ద్వారా గుర్తించారు.స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఎరుగనంత పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా సృష్టించగలిగారు. ఉద్యోగ కల్పనా విధానంలో, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో మిగతా వేతన ఉపాధి పథకాలతో పోలిస్తే ఇది చాలా విభిన్నమైనది.

గ్రావిూణ ప్రజల అవసరాల కోసం ముఖ్యంగా రైతు అభివృద్ధి ధ్యేయంగా, గ్రామీణ బీద, పేద, హరిజన, గిరిజన, వికలాంగ, మహిళల హక్కులను కాపాడుతూ, గ్రావిూణ ప్రజల హక్కును నెరవేర్చుతూ, గ్రామసభల ఆధారంగా చేయాల్సిన పనులను చర్చించి, ఆమోదించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం దీనిలో వున్న మరో ముఖ్యమైన ప్రత్యేకత.పార్లమెంటు ఆమోదంతో ఏర్పడి చట్టంగా మారిన ఈ పథకంలో దాదాపు ఐదు లక్ష్యాలు దాగివున్నాయి. మొదటిది, గ్రావిూణ ప్రాంతాలో ఉన్న కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో నూరు రోజులకు సరిపడా నైపుణ్యం అవసరం లేని శారీరక కష్టంతో కూడిన పనిని అందించడం. దీని ద్వారా గ్రావిూణ ప్రాంతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా తగిన నాణ్యత, మన్నిక కలిగిన ఆస్తులను సృష్టించడం. రెండవది, పేద ప్రజలకు జీవనోపాధి పొందే అవకాశాలను బలోపేతం చేయడం, మూడవది, సమాజంలోని అన్ని వర్గాల వారిని గ్రావిూణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం. నాలుగవది పరిపాలనలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం. ఐదవది పంచాయతీరాజ్‌ సంస్థను బలోపేతం చేయడం.

ఈ లక్ష్యాలకు అనుగుణంగా దాదాపు 155 రకాల పనులను ఆమోదింప చేయబడి అమలు చేస్తున్నారు.వాటిలో ముఖ్యమైనవి సహజ వనరుల నిర్వహణలో భాగంగా నీటి సంరక్షణ పనులు, ఇంకుడు గుంతల తవ్వకం, మొక్కల పెంపకం మొదలైనవి. బడుగు, బహీన వర్గాలకు ప్రత్యేకించిన ఆస్తుల అభివృద్ధి, బీడు, బంజరు భూముల అభివృద్ధి. జాతీయ గ్రావిూణ జీవనోపాధి మిషన్‌కు సంబంధించిన సాధారణ మౌలిక వసతుల కల్పన, గ్రామ స్థాయిలో సమావేశాల కోసం, మహిళా స్వయం సహాయక బృందాల కోసం, ఆహార ధాన్యాల నిల్వ కోసం అవసరమైన భవనాల నిర్మాణం చేపట్టి గ్రావిూణ మౌలిక వసతులకు సంబంధించిన పనులను త్వరితంగా చేపట్టి గ్రామీణ ప్రజలకు సుపరిపాలన అందించడం ముఖ్య ఉద్దేశంగా ఈ పథకం లో దాగిఉన్న అంశాలు తెలియజేస్తున్నాయి. కరోనా సంక్షోభంలో గ్రావిూణులకు, వలస కార్మికులకు జీవన ఉపాధి కల్పించి ఆదుకుంది ఈ మహాత్మాగాంధీ ఉపాధి హావిూ పథకం. ఉపాధి చట్టం -2005 లోని అన్ని అంశాలను పకడ్బందీగా అమలు పరచాలి. గ్రావిూణ అభివృద్ధి కార్యక్రమాలో భాగంగా నాణ్యమైనటువంటి ఆస్తులను సృష్టించే పనులను చేస్తూ పారదర్శకతను పాటించాలి. ఉపాధి హామీ నిధులను గ్రావిూణ ప్రాంతాలో జరిగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా డైవర్ట్‌ చేయాలి. పరిపాలనాపరమైన ఇబ్బంలదును ఎదుర్కోవలసిన మానవ వనరులకు తగిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. గ్రామ సభలను బలోపేతం చేస్తూ టెక్నాలజీ వాడకాన్ని త్వరితగతంగా ఉపయోగించాలి. గ్రావిూణ రైతాంగ చిరకాల కోరిక అయినా వ్యవసాయాన్ని ఈ పథకంతో అనుసంధానం చేస్తే రైతుల ఆశలు సజీవంగా నెరవేర్చినవారం అవుతాము.

Related News

Leave a Reply

Your email address will not be published.