ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ప్లాంట్లు

 ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ప్లాంట్లు

భూమిపుత్ర, హైదరాబాద్‌:

కరోనా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మరో కీలక ముందడుగు వేసింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో మరో రెండు ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. మంగళవారం విూడియాతో మాట్లాడిన ఆమె ఇప్పటికే ఆంధప్రదేశ్‌లో నాలుగు ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా దాతలందరికీ భువనేశ్వరి పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అనాథ శవాల అంతిమ సంస్కారాలకు ట్రస్ట్‌ సేవావిభాగం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. టెలీమెడిసిన్‌, మందుల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. 24/7 కాల్‌ సెంటర్‌ ద్వారా కరోనా రోగులకు నిరంతర సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.

Related News

Leave a Reply

Your email address will not be published.