ఆనందయ్య మందుతో దుష్ఫలితాలు రాలేదు

 ఆనందయ్య మందుతో దుష్ఫలితాలు రాలేదు

ఎందరో మందు తీసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు-కాకాణి

భూమిపుత్ర, నెల్లూరు:

ఇప్పటికే వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని, ఎక్కడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని కరోనా బాధితులు చెబుతున్నారన్నారు. వేల మంది రావడం వల్ల ఇబ్బంది కలుగుతోందని, ఈరోజు సాయంత్రం ఐసీఎంఆర్‌ బృందం నెల్లూరుకి చేరుకుంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావద్దని ఎమ్మెల్యే కాకాని అన్నారు. వేల మంది రావడం వల్ల పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఆయుష్‌ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు, క్లీన్‌ చిట్‌ వస్తే ఇతర రాష్ట్రాల వారికి కొరియర్‌ చార్జీలు కూడా తామే భరించి మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాని స్పష్టం చేశారు.ఇదిలావుంటే నెల్లూరుకి ఐసీఎంఆర్‌ టీమ్‌ను పంపాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. కరోనాకు విరుగుడుగా ప్రచారం జరుగుతున్న ఆనందయ్య మందుపై అధ్యయనానికి ఈ బృందం వెళుతోంది. సీఎం వద్ద ఆనందయ్య మందుపై చర్చ జరిగింది. ఆయన ఆదేశాల మేరకు సాయంత్రానికే ఐసీఎంఆర్ బృందం నెల్లూరు చేరుకుంది

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *