హిట్ చిత్రాల రారాజు “ఎంఎస్ రాజు” దర్శకత్వంలో “7 డేస్ 6 నైట్స్” !!!

 హిట్ చిత్రాల రారాజు “ఎంఎస్ రాజు” దర్శకత్వంలో “7 డేస్ 6 నైట్స్” !!!

ఎం.ఎస్.రాజు

భూమిపుత్ర, సినిమా:

ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ విజయాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగానూ గత ఏడాది ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. దీనికి నిర్మాతలుగా సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ ‘7 డేస్ 6 నైట్స్’ సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుడుతున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. కొంత హైదరాబాద్… మరికొంత గోవా, మంగుళూరు, అండమాన్ నికోబర్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. ‘డర్టీ హరి’తో తన సత్తా చూపించిన నాన్నగారు, మరో విభిన్నమైన జానర్ లో ఈ సినిమా చేయనున్నారు” అని అన్నారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ “యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. సంగీతం, ఇతర సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తాం. గత ఏడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసలు మరువలేనివి. చాలామంది పెద్దవాళ్ళు నేను గొప్పగా తీశానని మెచ్చుకున్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ‘డర్టీ హరి’కి నాకు అండగా నిలబడి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నిర్మాత గూడూరు శివరామకృష్ణగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రానికి కూడా ఆయన వెన్నంటే ఉంటారు. ‘డర్టీ హరి’ని మించి ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, పబ్లిసిటీ: ఈశ్వర్ అందే, సెకండ్ యూనిట్ డైరెక్టర్స్: అశ్విన్ కశ్యప్, యువి సుష్మ, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *