పశ్చిమ బెంగాల్ సిఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం

 పశ్చిమ బెంగాల్ సిఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం

ప్రమాణ స్వీకారం చేస్తున్న మమతా బెనర్జీ

భూమిపుత్ర,కోల్‌కతా:
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి అధికారపీఠం అదిష్టించారు. గవర్నర్‌ అధికారిక నివాసంలో బుధవారం ప్రమాణస్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. దీదీతో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ కారణంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా క్లుప్తంగా జరిగింది. మమతా బెంగాలీలో ప్రమాణస్వీకారం చేశారు. అంతకుమందు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం అనంతరం టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ విలేకరులతో మాట్లాడుతూ… కొత్తగా ఎన్నికైన సభ్యులు మే 9 న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.

కాగా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 292 సీట్లలో 213 సీట్లను గెలుచుకున్న టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. 77 స్థానాలను బీజెపీ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్‌ 17 వ అసెంబ్లీ నాయకురాలిగా మమతా బెనర్జీని ఎన్నుకున్నట్లు టీఎంసీ పార్టీ నుంచి సమాచారం వచ్చిన తరువాత, మే 5 న ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బెనర్జీని రాజ్‌ భవన్‌కు ఆహ్వానించామని గవర్నర్‌ ధన్‌కర్‌ ట్వీట్‌ చేశారు. కాగా తృణమూల్‌ ఎమ్మెల్యేలు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ విమన్‌ బెనర్జీని కొత్త అసెంబ్లీ యాక్టింగ్‌ స్పీకర్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ’పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా దీదీకి అభినందనలు’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్‌లో ఇటీవల 292 నియోజకవర్గాలకు ఎనిమిది విడుతల్లో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. గత ఆదివారం వెలువడిన ఫలితాల్లో 213 నియోజకవర్గాల్లో విజయం సాధించి, వరుసగా మూడోసారి బుధవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *