సమాజ చైతన్యానికి సాహిత్యం ఎంతో ముఖ్యం

 సమాజ చైతన్యానికి  సాహిత్యం ఎంతో ముఖ్యం

భూమిపుత్ర,సాహిత్యం :

సమాజాన్ని చైతన్యవంతం చేయడంలోను, సత్వర పరిష్కారాన్ని సూచించటం లోనూ సాహిత్యం ఒక వైద్యుడులా పనిచేస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు.  శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ కళాశాల ఎమ్మిగనూరులో నిర్వహించిన జాతీయ వెబినార్ లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. మొదటి నుండి తెలుగు సాహిత్యం సమకాలీన సమాజాన్ని ప్రతిఫలిస్తూనే కొనసాగిందని, దాని ప్రభావమే ఆధునిక తెలుగు కవిత్వంలో వివిధ ధోరణులు రావడానికి ప్రధాన కారణమని ఆయన వివరించారు. భారతదేశంలో వివిధ పాలకులు ముఖ్యంగా ఆంగ్లేయుల పాలన వలన అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఆ మార్పులు సాహిత్యంలో కూడా కనిపించాయని, దానితో తెలుగు సాహిత్యంలో కూడా ఆధునికత ప్రవేశించిందని ఆయన సోదాహరణంగా వివరించారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు ఆధునికతకు బీజాలు వేశారని, దాన్ని సంస్కరణ దృష్టితో కందుకూరి, గిడుగు ముందుకు తీసుకు వెళ్లారని ఆయన అన్నారు.

ఈ ప్రభావం వలన తెలుగు కవిత్వంలో భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత ఉద్యమ కవిత్వం, ప్రపంచీకరణ కవిత్వం, ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం కవిత్వం, సమాజానికి ఎటువైపు ఉండాలో తెలియని ఇటువంటి స్థితిలో పోస్ట్ మోడర్న్ పోయిట్రీ కూడా వచ్చిందని , ఇలా సమాజ అవసరాలకు, సమాజ ప్రతిబింబంగాను వచ్చిన తెలుగు కవిత్వం తన పాత్రను నిర్వహించిందని ఆయన సోదాహరణంగా వివరించారు. వస్తు నవ్యత, వైవిధ్యంతో పాటు రూపపరిణామంలో కూడా తెలుగు కవిత్వం తన ప్రత్యేకతను ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఈ సదస్సుకి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.మహబూబ్ భాషా అధ్యక్షత వహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో సాహిత్యం పట్ల చక్కటి అవగాహన కలిగిస్తాయని ఆయన అన్నారు.జాతీయ వెబినార్ కన్వీనర్ , వైస్ ప్రిన్సిపాల్ డా.పి.విజయకుమార్ మాట్లాడుతూ తూ.గో మన కళాశాలలో ఉన్న విద్యార్థులు ప్రతిభ మరింత మెరుగు పరుచుకోవడానికి విశ్వవిద్యాలయ స్థాయి ఆచార్య తో సమావేశాలను పెడుతున్నామని దీనివలన విద్యార్థినీ విద్యార్థుల సమాజం పట్ల సాహిత్యం పట్ల చక్కని అవగాహన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఐక్యుఏసి కోర్డినేటర్ డా ఎమ్. సుశీలమ్మ మాట్లాడుతూ ఇటువంటి జాతీయ సదస్సులు కళాశాల ర్యాంకింగ్ వినిపించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని అంతర్జాలం ద్వారా కాబట్టి మనకి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు ఈరోజు వెంటనే మనకు సమావేశంలో మాట్లాడగలుగుతున్నారు అదే ప్రత్యక్షంగా అయితే అది వెంటనే సాధ్యం కాలేకపోయింది వెంకటేశ్వర రావు గారి ప్రసంగం మన కళాశాల విద్యార్థులకు కళాశాల ర్యాంకింగ్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అని ఆమె అన్నారు. సమన్వయకర్త ఎమ్.వి.తిరుమలనాయుడు నాయుడు సమన్వయం చేస్తూ జాతీయ సదస్సులో వివిధ ధోరణుల గురించి ప్రస్తావించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు తెలుగు సాహిత్యం పట్ల చక్కటి అవగాహన కలిగించాలని మరింత సమయం ఉంటే ప్రతి దాని గురించి సోదాహరణంగా వివరించి అవకాశం ఉండేదనీ చెప్పి,వందన సమర్పణ చేశారు.విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *