బెంజిమెన్‌ నెతన్యాహు పాలనకు తెర

 బెంజిమెన్‌ నెతన్యాహు పాలనకు తెర

వివిధ పార్టీలతో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు

నూతన ప్రధానిగా అల్టా నేషనలిస్ట్‌ పార్టీ అధినేత బెన్నెట్‌

భూమిపుత్ర,అంతర్జాతీయం:

ఇజ్రాయిల్‌ ప్రధానిగా బెంజిమెన్‌ నెతన్యాహు 12 ఏళ్ల పాలనకు తెరపడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. మితవాద జాతీయ వాది నాఫ్తాలి బెన్నెట్‌, లాపిడ్‌లకు చెందిన పార్టీలతో కూడిన కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. నూతన ప్రధానిగా అల్టా నేషనలిస్ట్‌ పార్టీ అధినేత బెన్నెట్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 120 స్థానాలు గల పార్లమెంట్‌ సెనేట్‌లో ఆరు స్థానాలు మాత్రమే కల్గిన ఆయన పార్టీకి మరికొన్ని పార్టీలు మద్దతు ప్రకటించడంతో మ్యాజిక్‌ నంబర్‌ రావడంతో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. నెతన్యాహును గద్దె దించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పార్టీలు ఇదే అవకాశంగా తీసుకుని నాఫ్తాలి‌ కి మద్దతుగా నిలిచాయి. ఇప్పటికే కుదిరిన సంకీర్ణ ఒప్పందం ప్రకారం మొదటి రెండు సంవత్సరాలు ప్రధానిగా శత కోటీశ్వరుడైన బెనెత్‌, ఆ తరువాతి రెండు సంవత్సరాలు యేష్‌ అటిడ్‌ పార్టీ నేత యైర్‌ లాపిడ్‌ ప్రధానిగా ఉంటారు.

పాలస్తీనా పట్ల నెతన్యాహూ అవలంబిస్తున్న నిరంకుశ వైఖరినే బెన్నెట్‌ కూడా అనుసరిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో ఎటువంటి పురోగతి ఉండకపోవచ్చని, నెతన్యాహూ అనుసరించిన మితవాద అజెండానే బెన్నెట్‌ కూడా అనుసరిస్తాడని పేర్కొంటున్నారు. ఇజ్రాయిల్‌ ప్రధానిగా బెంజిమెన్‌ నెతన్యాహూ 12 ఏళ్ల పాలనకు తెరదించి, కొత్త ప్రభుత్వానికి ఓటు వేసే పక్రియ మొదలైంది. నెతన్యాహు పాలన ముగిసిందన్న ప్రకటన కోసం వేలాది మంది నిరసనకారులు కెనెసట్‌ వెలుపల ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయిల్‌ ప్రధా నఫ్తాలి బెనెత్‌, లాపిడ్‌లకు చెందిన పార్టీలతో కూడిన కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనపై ఓటేసేందుకు స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పార్లమెంట్‌ సమావేశమైంది.

కొత్త ప్రభుత్వ ఏర్పాటు ద్వారా దేశంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన తొలగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇజ్రాయిల్‌లో గత రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా చివరిగా ఈ ఏడాది మార్చి 23న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో 71 ఏళ్ల నేతన్యాహూ విఫలమయ్యారు. 120 స్థానాలు ఉన్న ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో నేతన్యాహూకు చెందిన అధికార పార్టీ 30 స్థానాలు మాత్రమే విజయం సాధించింది. పార్లమెంట్‌లో దీంతో రెండో స్థానంలో పెద్ద పార్టీగా ఉన్న లాపిడ్‌ నేతృత్వంలోని యేష్‌ అటిడ్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకుంది. ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలిచి కింగ్‌మేకర్‌గా నిలిచిన పచ్చి మితవాది అయిన నఫ్తాలి బెనెత్‌కు చెందిన పార్టీతో సహా ఎనిమిది ప్రతిపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదించింది.

ఇప్పటికే కుదిరిన సంకీర్ణ ఒప్పందం ప్రకారం మొదటి రెండు సంవత్సరాలు ప్రధానిగా శత కోటీశ్వరుడైన బెనెత్‌, ఆ తరువాతి రెండు సంవత్సరాలు మాజీ పాపులర్‌ టివి హోస్ట్‌గా పేరుపొందిన లాపిడ్‌ ఉంటారు. పాలస్తీనా పట్ల నెతన్యాహూ నిరంకుశ వైఖరి కంటే బెనెత్‌ విధానాల్లో పెద్దగా మార్పేవిూ ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో ఎటువంటి పురోగతి ఉండకపోవచ్చని, నేతన్యాహూ అనుసరించిన మితవాద అజెండానే బెనెత్‌ కూడా అనుకరిస్తాడని పేర్కొంటున్నారు. పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావడమంటే అది ఇజ్రాయిల్‌కు ఆత్మహత్య సదృశ్యమే అవుతుం దని బెనెత్‌ గతంలో వాదించారు. యూదులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలన్నింటినీ ఇజ్రాయిల్‌లో విలీనం చేయాలని గతంలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *