కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం

 కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం

ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియామకం

భూమిపుత్ర, న్యూఢిల్లీ:

ఆంధ్రా ఆణిముత్యం కరణం మళ్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఆప్‌ సర్కార్‌ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ లో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రఖ్యాత వెయిట్‌ లిప్టర్‌, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ… ఢిల్లీ లోని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి కరణం మల్లీశ్వరి మొట్టమొదటి వీసీ అవుతారని, త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇటీవల డిప్యూటీ సిఎం మనీశ్‌ సిసోడియా మాట్లాడుతూ క్రీడాకారులు ఇకపై ఇతరత్రా డిగ్రీ చేయాల్సిన అవసరం లేదని నేరుగా క్రీడా స్జబెక్టుల్లోనే డిగ్రీ చేయవచ్చని తెలిపారు. తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని అన్నారు. డిగ్రీ స్థాయి నుంచి పిహెచ్‌డి వరకు వివిధ క్రీడాంశాల్లో యూనివర్సిటీ కోర్సులను అందిస్తుందని చెప్పారు. ఒలింపిక్‌ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు పసిడి పతకాలను తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ యూనివర్సిటీ ముఖ్య లక్ష్యమన్నారు. ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని మనీశ్‌ సిసోడియా స్పష్టం చేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *