బ్లాక్ ఫంగస్ కేసులతో అప్రమత్తమైన కేంద్రం

 బ్లాక్ ఫంగస్ కేసులతో అప్రమత్తమైన కేంద్రం

ట్విట్టర్‌ ద్వారా సూచనలు చేసిన కేంద్రమంత్రి హర్షవర్ధన్‌

భూమిపుత్ర, న్యూఢిల్లీ:

దేశంపై కరోనాతో పాటు దాని వెనుక మ్యూకోర్‌ మైకోసిస్‌ అలియాస్‌ బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించారు. దీని బారిన పడితే..చనిపోయే ప్రమాదం ఉన్నందన ప్రజల్లో కొత్త ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్‌ ప్రజలకు శుక్రవారం కొన్ని సూచనలిచ్చారు. ముందుగా దీన్ని గుర్తించి…ఎలా అరికట్టాలో సలహానిచ్చారు. ’ అవగాహన, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను ముందుగా గుర్తించడం ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చు’ అని తెలిపారు. ఫంగస్‌, లక్షణాలు, ఎవరైనా దీని బారిన పడిన తర్వాత తీసుకోవసిన నాలుగు చర్యల గురించి ట్విట్టర్లో పంచుకున్నారు. అరుదైన, ప్రమాదకరమైన బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు.

పుణె జిల్లాలో 270 కేసులను గుర్తించడంతో ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్‌ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసుపత్రులల్లో ఈ రోగులకు చికిత్స సమయంలో పాటించవసిన నిబంధనలను తెలియజేసింది. బ్లాక్‌ ఫంగస్‌ను మ్యుకర్మైకోసిస్‌ అంటారు. ఇది సోకినవారికి తలనొప్పి, జ్వరం, కళ్ళ క్రింద నొప్పి, ముక్కు దిబ్బడ, కంటి చూపు మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి. సైనస్‌, మెదడు, ఊపిరితిత్తులపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది. ఇది ప్రాణాంతకం కావచ్చు. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న, కోలుకుంటున్న రోగుల్లో ఇది మొదట కనిపించింది. పుణె డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావ్‌ శుక్రవారం మాట్లాడుతూ, ఇప్పటి వరకు 270 బ్లాక్‌ పంగస్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోటోకాల్‌ను డివిజినల్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ భరత్‌ పురందరే రూపొందించారని చెప్పారు. ఈ మార్గదర్శకాలను టాస్క్‌ఫోర్స్‌ తనిఖీ చేసిందని చెప్పారు. మహారాష్ట్రలోని అన్ని ఆసుపత్రులు ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులకు చికిత్సలో ఈ మార్గదర్శకాలను పాటించాలని కోరినట్లు తెలిపారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *