నవలా ప్రపంచంలో తిరుగులేని రాణి -యద్దనపూడి సులోచనారాణి

 నవలా ప్రపంచంలో తిరుగులేని రాణి -యద్దనపూడి సులోచనారాణి

భూమిపుత్ర,సాహిత్యం:

నవలాప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార, ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూసి అప్పుడే రెండేళ్లు అయ్యిందా అని అనిపిస్తోంది. మూడేళ్ళ క్రితం మే 21న ఆమె అమెరికాలో కన్నుమూశారు. యుద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి అని నిరూపించుకుని తెలుగునాట సుప్రసిద్ధ రచయిత్రిగా ఖ్యాతి గడిరచారు. “నవలా దేశపు రాణి”గానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఇంతగా సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లో ఆమె రాసిన నవలలు గృహిణులకు కాలక్షేపంగా ఉండేవి. వివిధ పత్రికల్లో ఆమె రాసిన నవలలు సీరియళ్లుగా, ఆ తరవాత సినిమాలుగా వచ్చాయి. అలా ఆమె నవలా ప్రపంచంలో రారాణిగా వెలుగొందారు. ఆమె నవలలు వీక్లీ, మంత్లీల్లో ప్రచురితం కావడంతో ఆమె ఆంధ్ర ప్రేక్షకులకు ఆరాధ్య రచయిత్రిగా మారారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో రెండేళ్ల క్రితం స్వర్గస్థులయ్యారు. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాసి,నవలాచరిత్రలో తిరుగలేని మహారాణి అనిపించుకున్నారు. ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు.

 

1970 దశకంలో యుద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి. ఆమె రాసిన అనేక నవలలు.. సినిమాలు, టీవీ సీరియళ్లుగా తెరకెక్కాయి. విూనా, ఆగమనం, ఆరాధన, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, కల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మౌన పోరాటం, మౌనభాష్యం, వెన్నెల్లో మల్లిక, విజేత, శ్వేత గులాబి, సెక్రటరీ తదితర నవలలు రచించారు. ఆమె రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవ ’మీనా’. దీని ఆధారంగానే ’మీనా’ చిత్రం తెరకెక్కింది. సెక్రటరీ యద్దనపూడి సులోచనారాణి రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల 1964లో తొలిసారి ప్రచురణ పొందిననాటి నుంచి ఎన్నో ముద్రణలు పొంది పాఠకుల ఆదరణను, సినిమాగా చిత్రితమై ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఆలుమగ మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన యద్దనపూడి సులోచనారాణి రచనలు అనేకం. ఈమె కథు పు సినిమాలుగా మచబడ్డాయి. నవలా సాహిత్య లోకంలో యద్ధనపూడి ఎప్పటికీ చిరంజీవిగానే ఉన్నారు. ఆమె వర్దంతిని పురస్కరించుకుని పలువురు సాహితీ మిత్రులు నివాళి అర్పించారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *