గుజరాత్‌ వద్ద తీరం దాటిన తౌక్టే తుఫాన్‌

 గుజరాత్‌ వద్ద  తీరం దాటిన తౌక్టే తుఫాన్‌

భూమిపుత్ర,జాతీయం:

గుజరాత్‌ వద్ద తౌక్టే తుపాను తీరాన్ని తాకింది. గంటకు 185 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముంబై తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీభత్సం సృష్టిస్తున్న తౌక్టే తుపాను పోర్‌బందర్‌- మహువా దగ్గర తీరం దాటింది. వెరవల్‌ సోమనాథ్‌ తీరంలో సముద్ర అలలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తుపాన్‌ ప్రభావం వ్లత డియూ,అమ్రేలి, భావనగర్‌, బోటాడ్‌, అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, మెహసన, సబర్‌ కాంత, బాణాస్‌ కాంత ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షం కురుస్తోంది.

తుపాన్‌ ప్రభావం వల్ల ముందు జాగ్రత్తగా సూరత్‌ నగరంలోని విమానాశ్రయాన్ని మూసివేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సూరత్‌ కు రాకపోకలు సాగించాల్సిన విమానసర్వీసులను రద్దు చేశారు. అలాగే మహారాష్ట్ర, ముంబైల్లోనూ విద్వంసం కొనసాగుతోంది. కేరళలో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలతో పశ్చిమ తీర ప్రాంతం అల్లకల్లోలం గా మారింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే తుఫాన్‌ తీవ్ర రూపం దాల్చడంతో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నష్టం వాటిల్లింది. కేరళలో సముద్రం ముందుకు రావడం, అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

కర్ణాటకలో భారీ వర్షాలకు 73 గ్రామాల్లో భారీగా నష్టం జరిగింది. రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌లకు భారీ వర్ష సూచన ఉంది. తెలుగు రాష్ట్రాలపై తౌక్టే తుపాను ప్రభావం కొనసాగుతోంది. తౌక్టే తుపాను కారణంగా తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. తౌక్టే ప్రభావంతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. వర్షాల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అటు ఏపీలోనూ రెండ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో 150 నుంచి 170 కి.విూ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇప్పటికే తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.విూ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.

ప్రభావిత రాష్ట్రాల్లో 100 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. తుఫాన్‌ ప్రభావం రాష్ట్రంపై ఉండబోదని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. తుఫాన్‌ దిశగా గాలులు వీస్తున్నందున ఉక్కపోత కొనసాగుతుందన్నారు.మరో 24 గంటల్లో ముంబై, థానె, ఉత్తర కొంకణ్‌, పాగఢ్‌ ప్రాంతాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్‌గఢ్‌లో మరింత ఎక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. తీర ప్రాంతాలో బమైన గాలులు వీస్తాయని సూచించింది. తుఫాన్‌ నుంచి ముంబై నగరానికి నేరుగా ముప్పులేదని వెల్లడించింది. భారీ వర్షసూచన ఉండటంతో ముంబై వాసులు జాగ్రత్తగా ఉండాలని, నగర పాలక సంస్థ సూచనలను పాటించాలని మేయర్‌ కిశోరి పడ్నేకర్‌ విజ్ఞప్తి చేశారు. తుఫాన్‌ తీరం దాటనున్న గుజరాత్‌లో అధికారులు యెల్లో అలర్ట్‌ ప్రకటించారు. రవాణా, విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులకు వందలాది స్తంభాలు విరిగాయని, హై టెన్షన్‌ వైర్లపై చెట్లు కూలడంతో సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలల తాకిడికి కేరళ అల్లాడిపోతోంది. సముద్రం ఉన్నట్టుండి ముందుకు చొచ్చుకురావడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 9 జిల్లాలో తీవ్ర ప్రభావం ఉంది. ముఖ్యంగా ఎర్నాకుళం, త్రిసూర్‌, తిరువనంతపురం, అప్పుజా, కోజికోడ్‌లో అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యు చేపడుతున్నాయి. తీర, లోతట్టు ప్రాంతాలో వందలాది కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించారు. ఎర్నాకులం, ఇడుక్కి, మప్పురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఆరెంజ్‌ అర్ట్‌ ప్రకటించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *