కరోనా రెండవ దశతో మళ్ళీ చదువులు అటకెక్కినట్లేనా!!

 కరోనా రెండవ దశతో మళ్ళీ చదువులు అటకెక్కినట్లేనా!!

భూమిపుత్ర,సంపాదకీయం:

కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంటోంది. ఇప్పటికే తెలంగాణ లో విద్యాసంస్థలను మూసేసారు.ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు నడపటానికి సందేహిస్తున్నారు. కేవలం ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే నడుస్తున్నాయి. టెన్త్‌, ఇంటర్మీడియట్‌ అధికారులతో పాటు ఆయా యూనివర్సీటీలకు చెందిన ఉన్నతాధికారులంతా ఇప్పటికే వార్షిక పరీక్షలకు సంబంధించి తమ అభిప్రాయాలను సర్కారుకు నివేదించినట్లు తెలిసింది. వీరందరి అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం రాబోయే రోజుల్లో పరీక్షలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రులలోనూ కొనసాగుతోంది. వరుసగా రెండో ఏడు కూడా కరోనా విజృంభణ కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఆందోళన నెలకొంది. దీనికితోడు చదువులు చట్టుబండలు అయ్యాయని వాపోతున్నారు. పిల్లలకు సబ్జెక్టు నాలెడ్జ్‌ లేకుండా పోయిందని వాపోతున్నారు. సరిగ్గా గతేడాది ఉన్న పరిస్థితులే ఇప్పుడు తాండవిస్తున్నాయి. అంతకుమించి రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల విద్యార్థుల్లో చాలామందికి కరోనా సోకింది. దీంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతులు పరిస్థితి కూడా అయోమయంగా ఉందంటున్నారు. ఆన్‌లైన్‌ బోధన విషయంలో సంబంధిత టీచర్లు, లెక్చరర్లు పర్యవేక్షించేందుకు ఇంటింటికీ తిరగలేని పరిస్థితున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా ఇతరులెవరినీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఇళ్లలోకి రానివ్వడం లేదు. దీంతో టీచర్లు పాఠశాలలు, కాలేజీలకే పరిమితమైపోతున్నారు. ఈ కారణంగా ఆన్‌లైన్‌ తరగతులపైనా అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం పదవతరగతి పరీక్షలను రాయకుండానే ఆ పరీక్షకు ఫీజు చెల్లించిన వారిని పాస్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇంటర్మీడియట్‌ది కూడా అదే పరిస్థితి. ఈ సారి గత సంవత్సరం కన్నా కరోనా ఉధృతి తీవ్రంగా ఉండడంతో పరీక్ష నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వందలాదిమంది విద్యార్థులను గదుల్లో కూర్చోబెట్టి పరీక్షలు రాయించడం సాహసోపేతమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సాహసాలు చేస్తే ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్‌ సోకితే పరిస్థితులు మరింత తీవ్రరూపందాల్చే అవకాశాలుంటాయన్న ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది. దీంతో ఈసారి కూడా గత సంవత్సరం మాదిరిగానే పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు సైతం లేకపోలేదంటున్నారు. ఇప్పటికే పదవతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం విద్యార్థుల నుంచి ఫీజు కూడా వసూలు చేశారు. కొద్ది రోజుల్లోనే ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు కూడా మొదలుకాబోతున్నాయి. ఇకపోతే విద్యార్థులకు చాలా చోట్ల ఇప్పటికీ నెట్‌వర్క్‌ అందక వారంతా ఆన్‌లైన్‌ పాఠశాలలకు దూరమవుతున్నారు. మారుమూల మండలాల్లోని చాలా పల్లెలకు సిగ్నల్‌ సౌకర్యం లేని కారణంగా విద్యార్థులు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలను నిర్వహించడం కత్తి మీద సాములాగా మారే అవకాశం ఉందంటున్నారు.సరిగ్గా వార్షిక పరీక్షలకు పిల్లలందరూ సిద్ధం కాబోతున్న వేళ మళ్లీ కరోనా తన పంజా విసురుతూ ఉగ్రరూపం దాల్చడం అటు విద్యార్థులను, ఇటు తల్లిదండ్రులను కూడా గందరగోళంలోకి నెట్టింది. మరోవైపు ప్రైవేట్‌ విద్యారంగంలో పనిచేస్తున్న బోధన,బోధనేతర సిబ్బంది రోడ్డున పడ్డారు. అలాగే ఫీజుల చెల్లింపు ఆగక తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం మాదిరిగానే మార్చి నుంచి మొదలైన కరోనా సెకండ్‌ వేవ్‌ రోజురోజుకూ విస్తరిస్తూ జనాన్ని హడలెత్తిస్తోంది. ప్రతీరోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా వైద్య, ఆరోగ్యశాఖ అలాగే మిగతా సంబంధిత శాఖన్నీ హడలెత్తిపోతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలను నిర్వహించకుండా కేవలం టీచర్లు మాత్రమే హాజరయ్యేట్లు చూస్తున్నారు. ఇంటర్మీ డియట్‌తో పాటు డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యాసంస్థలు కూడా తరగతులను నిలిపివేసి ఆన్‌లైన్‌ తరగతుల భోధనను నిర్వహిస్తున్నాయి. ఇదిలావుంటే ఆన్‌లైన్‌ విద్యాభోధనపై అనేక రకా సందేహాలు కొనసాగు తున్నాయి. టీవీ, సెల్‌ఫోన్‌ ల ద్వారా ఆన్‌ లైన్‌ భోధనకు సంబంధించి ప్రసారాలు జరుగుతున్నప్పటికి చాలా మంది విద్యార్థులు ఈ తరగతులను వినడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రావిూణ ప్రాంతాల్లో టీవీ సౌకర్యం లేకపోవడం, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందకపోవడంతో విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుకు దూరమైపోతున్నారు. అయితే మొక్కుబడిగా మాత్రం ప్రసారాలు కొనసాగుతున్నాయే తప్ప ఉన్నతాధికారుల పకడ్బందీ పర్యవేక్షణ సైతం కరువైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యక్షభోధనకు పరిస్థితులు అనుకూలించకపోతుండడంతో ప్రభుత్వం సైతం ఆన్‌లైన్‌ భోధనవైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఆన్‌లైన్‌ భోధన అయిందనిపిస్తున్నారే తప్పా విద్యార్థు సందేహాలకు పూర్తిస్థాయి పరిష్కారం దొరకడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటికే హైస్కూల్‌ యాజమాన్యాలు పదవ తరగతి పరీక్షు రాసే విద్యార్థుల నుంచి ఫీజును వసూలు చేయగా ఇంటర్‌ విద్యార్థుల నుంచి జూనియర్‌ కళాశాల యాజమాన్యాలి సైతం ఫీజు వసూలు చేసి పరీక్ష కోసం నామినల్‌ రోల్స్‌ కూడా సిద్ధం చేశాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. అయితే గతం మాదిరిగానే కరోనా ఈసారి కూడా పరీక్షల సమయంలోనే విభృంభించిపోవడంతో అధికారులు ఈ పరీక్షల నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో ఈ పరీక్షలు రాసే విద్యార్థులు కరోనాబారిన పడితే ప్రమాదకరమని భావిస్తున్నారు. ఒక్కోగదిలో కనీసం 20 మందికి తగ్గకుండా పరీక్షలను రాయించాలనుకున్నప్పటికీ ఏదోరకంగా వైరస్‌వ్యాప్తి జరిగే ప్రమాదం లేకపోలేదంటున్నారు. దీంతో ఈ సారి పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహించడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా అందరిని ఉత్తీర్ణత చేయడమే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణ డిగ్రీతో పాటు బీటెక్‌ చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ సారి సెమిస్టర్‌ పరీక్షను ప్రత్యక్షంగా నిర్వహించడం కుదరదంటు న్నారు. వీరికి మొదటి సెమిస్టర్‌ను పక్కన పెట్టి రెండో సెమిస్టర్‌కు సంబంధించిన పాఠాలు భోధించేందుకు ఆయా ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అలాగే డిగ్రీ యాజమాన్యాలు సైతం ఇదే తరహా లో వ్యవహరించాంటూ యోచిస్తున్నాయి.ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల పైనే పరీక్ష నిర్వహణ అంశం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *