తల్లితండ్రుల నుంచి పిల్లలకు కరోనా

 తల్లితండ్రుల నుంచి పిల్లలకు కరోనా

భూమిపుత్ర,విజయవాడ:

సెకండ్‌ వేవ్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే మిగతా కుటుంబసభ్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. అప్పుడే పుట్టిన వారి నుంచి ఎదుగుతున్న పిల్లల వరకు ఎవరూ వైరస్‌ కి మినహాయింపు కాదని నగరానికి చెందిన పీడియాట్రిషియన్లు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పేరెంట్స్‌ నుంచి ఇంట్లోని చిన్నారులకు వైరస్‌ అటాక్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వైరస్‌ ఇన్ఫెక్ట్‌ అవ్వొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. బాలింతకు పాజిటివ్‌ ఉంటే 90 శాతం బిడ్డకు కూడా వైరస్‌ సోకుతుందంటున్నారు. అందుకే డెలివరీ టైమ్‌ లో బిడ్డను సెపరేట్‌ చేసి ఎన్‌ఐసీయూ (న్యూ బార్న్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌) లో పెట్టి మొదటి 5 రోజులు అందులోనే ఉంచుతున్నామన్నారు. టెస్ట్‌ చేసి నెగిటివ్‌ వచ్చాక తల్లీబిడ్డలను ఒకచోట ఉంచుతున్నామని చెప్తున్నారు. ఐదేండ్లు దాటిన పిల్లలకు కరోనా వస్తే టేస్టు, స్మెల్‌ పోతుందని, ఈ లక్షణాల ద్వారా వారికి వైరస్‌ అటాక్‌ అయినట్లు గుర్తించాలంటున్నారు. వారు తినడం మానేయడంతో పాటు నిద్రలో లేచి ఏడుస్తారని అలాంటప్పుడు వెంటనే పీడియాట్రిషియన్‌ ని సంప్రదించాలంటున్నారు.

కరోనా సోకిన పిల్లలను ఇంట్లోనే ఓ గదిలో హోం ఐసోలేట్‌ చేసి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలి. పేరెంట్స్‌ ఎప్పటికప్పుడు వారిని పరిశీలన చేస్తూ ఉండాలి. పిల్లలకు సైతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఆక్సిజన్‌ స్థాయులు 95 శాతం కంటే తక్కువగా ఉన్నా లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాలి. సెకండ్‌ వేవ్‌ లో పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తమ పిల్లలకు కరోనా లక్షణాలున్నాయనే ఆందోళనతోనే చాలామంది పేరెంట్స్‌ వైద్యులను సంప్రదిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఆన్‌ లైన్‌ కన్సల్టేషన్‌ వైద్యులు ఇస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉంటోన్న పిల్లలను సైతం మార్నింగ్‌, ఈవెనింగ్‌ వీడియో కాల్స్‌ ద్వారా అబ్జర్వ్‌ చేస్తున్నారు. పిల్లల బిహేవియర్‌, వాళ్లు ఉంటున్న తీరు, తీసుకునే ఫుడ్‌ను తల్లితండ్రులు గమనించాలి. పోస్ట్‌ కొవిడ్‌తో చిన్నారులు హెల్త్‌ ఇష్యూస్‌ తో ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. అందుకే వారి హెల్త్‌ పట్ల పేరెంట్స్‌ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఆందోళన చెందకుండా ఆరోగ్య సమస్యలు ఎదురైనపుడు తక్షణమే చిన్నపిల్లల వైద్యులను సంప్రదించాలి

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *