ఆంధ్రప్రదేశ్

పొలిటికల్ మల్టీస్టారర్ తో బ్యాలట్ బాక్స్ బద్దలేనా!!

భూమిపుత్ర, ఆంధ్రప్రదేశ్: సినిమాల్లో మల్టీస్టారర్‌ కి ఎపుడూ విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు టాప్‌ హీరోల అభిమానులు కలసి సినిమాను చూస్తారు. గ్యారంటీగా బొమ్మ బాక్స్‌ బద్దలు కొడుతుందన్న లెక్కలేవో ఉంటాయి. రాజకీయాల్లో అలాంటి మల్టీ స్టారర్లు హిట్లు అయ్యాయా అంటే కొన్ని చోట్ల జరిగాయి. కానీ చాలా సార్లు ఫెయిల్‌ అయ్యాయి. ఈ మధ్యనే తమిళనాడు లో కమల్‌ హాసన్‌ శరత్‌ కుమార్‌ ల పొలిటికల్‌ మల్టీ స్టారర్‌ ని జనం తిరస్కరించారు. దాని […]వివరాలు ...

క్రీడలు

ఒలింపిక్ క్రీడలపై నీలి నీడలు!!

భూమిపుత్ర,క్రీడలు: కరోనా మహమ్మారి జపాన్‌లో విజృంభిస్తోంది. కొవిడ్‌ కారణంగా ఆదేశంలో జూన్‌ 20 వరకు ఆంక్షలు విధించారు. కరోనా వ్యాక్సినేషన్‌ కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టడంతో ఇప్పటి వరకు తక్కుమందికే వ్యాక్సిన్‌ వేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘టోక్యో ఒలింపిక్స్‌’ వచ్చే నెలలో ప్రారంభం అవుతాయా లేదా అనేది సందేహంగా మారింది. గతేడాది జరగాల్సిన విశ్వ క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ […]వివరాలు ...

సంపాదకీయం

మరో విద్యా సంవత్సరం కరోనార్పణమేనా!!

భూమిపుత్ర,బ్యూరో: వరుసగా రెండోయేడు కూడా విద్యా సంవత్సరం దెబ్బతింది ఈ యేడు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందా లేదా అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సం ప్రారంభం కావాల్సి ఉన్నా..కరోనా సెకండ్‌వేవ్‌తో ఇప్పటివరకు స్పష్టత లేదు. మహమ్మారి ఇంకా తుడిచిపెట్టుకుని పోలేదు. పరిస్థితులన్నీ బాగుండి వుంటే నేటికి నూతన విద్యా సంవత్సరం 2021-22 ప్రారంభమై వుండేది. కానీ కరోనా మహమ్మారి కారణంగా నూతన విద్యాసంవత్సరం నేటికీ ప్రారంభం కాలేదు. జూన్‌ 30వ తేదీ వరకూ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ చదువు

ఉద్యోగాల భర్తీకి నిర్దిష్ట కాలపట్టిక

ఎపిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన సిఎం జగన్‌ భూమిపుత్ర,అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులకు క్యాలెండర్‌ను ప్రకటించారు. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సిఎం శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాం. […]వివరాలు ...

తెలంగాణ

నకిలీ విత్తనాల ముఠా అరెస్టు

6 కోట్ల విలువైన విత్తనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌ రెడ్డి భూమిపుత్ర, నల్లగొండ: నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న 13 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏవీ రంగనాథ్‌, జిల్లా వ్యవసాయ […]వివరాలు ...

సినిమా

రాజరాజచోర టీజర్‌ విడుదల

భూమిపుత్ర, సినిమా: విభిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఆయన ’రాజ రాజ చోర’ అనే విభిన్న కథా చిత్రాన్ని చేస్తున్నాడు. మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌ ని హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్‌ విూడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా కీర్తి చౌదరి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ […]వివరాలు ...

సంపాదకీయం

ఉత్తరప్రదేశ్ విభజన బీజేపీని గెలిపిస్తుందా!!

భూమిపుత్ర,సంపాదకీయం: భారతీయ జనతాపార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఉత్తరప్రదేశ్‌. 2022 ప్రథమార్థంలో జరిగే శాసనసభ ఎన్నికలపైనే 2024 లోక్‌ సభ ఎన్నికలూ ఆధారపడి ఉంటాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ సుస్థిరపాలనకు ఉత్తరప్రదేశ్‌ ఊతమిస్తోంది. ఈ రాష్ట్రంలో లభించిన మెజార్టీనే దేశంలో బీజేపీని తిరుగులేని శక్తి గా మార్చింది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌ లో ఓటమి పాలైతే ఆ తర్వాత రెండేళ్లు కేంద్రంలో కూడా పరిపాలన సజావుగా సాగదు. అస్థిరత […]వివరాలు ...

తెలంగాణ

రాజకీయాలకు దూరంగా రాజనరసింహ

భూమిపుత్ర, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తో ఐదు దశాబ్దాల అనుబంధం దామోదర రాజనర్సింహది. తండ్రి వారసత్వంగా రాజకీయల్లోకి వచ్చిన ఆయన అనేక పదవులు చేపట్టారు. కానీ కొంత కాలంగా కాంగ్రెస్‌ లో నిశ్శబ్దంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన నియోజకవర్గంలో కూడా పెద్దగా పర్యటించడం లేదు. కాంగ్రెస్‌ లో జరుగుతున్న పరిణామాలు ఆయనను కలచి వేశాయని కొందరు సన్నిహితులు చెబుతున్నారు.దామోదర రాజనర్సింహ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు మంత్రిగా […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దంపతులు

భూమిపుత్ర,కర్నూలు: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైలం విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ జి వీరపాండియన్‌ పుష్ప గుచ్చం, పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారిగా దర్శనానికి వచ్చినందున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డిఐజి వెంకటరామిరెడ్డి, […]వివరాలు ...