జాతీయం

భారతీయ సామాజిక దార్శనికుడు డా.బాబూ జగ్జీవ న్ రామ్

భూమిపుత్ర,జాతీయం: “కొలిమి జ్వాలల్లో వన్నెదేలిన బంగారంలా ఎదిగిన జగ్జీవన్ రామ్ పట్ల నా ‘ఆత్మ’ గౌరవాభిమానాలతో ఉప్పొంగుతున్నది. జగ్జీవన్ రామ్ ‘అమూల్య రత్నం’ – గాంధీ ఓ బాపూజీ మన ‘బాబూజీ’ని గురించి రాసుకున్న మాటలివి. నవభారత నిర్మాణానికి నాంది పలికిన అగ్రశ్రేణి జాతీయ నాయకులలో డా. బాబూ జగ్జీవన్ రామ్ ఎంత ముఖ్యుడన్నది ఆయన మాటల్లోని సారాంశం తెలియజేస్తుంది. పిన్న వయసులోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. బానిసత్వ సంకెళ్ళ నుంచి భారత దేశ […]వివరాలు ...

క్రీడలు

ఐపీఎల్‌పై కరోనా పడగ !!

భూమిపుత్ర,క్రీడలు: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది.. కరోనా ఫస్ట్‌ వేవ్‌ కంటే తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితి కొనసాగుతోంది. ప్రజ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతగా హెచ్చరించినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మనకేమవుతుందిలే అన్న ధోరణితో దేశంలో డేంజర్‌ బెల్స్‌ మ్రోగుతున్నాయి. ఫస్ట్‌ వేవ్‌లో కేసులు భారీ సంఖ్యలో నమోదు అయినా.. లక్ష దాటింది లేదు.. కానీ, ఆ రికార్డును బ్రేక్‌ చేసిన సెకండ్‌ వేవ్‌… కొత్త రికార్డును సృష్టిస్తూ.. లక్షకు […]వివరాలు ...

సంపాదకీయం

ప్రజల నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తోందా!!

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వ్యాప్తి కి ప్రధానంగా ప్రజల నిర్లక్ష్యమే కారణమని గతేడాదిగా జరుగుతున్న పరిణమాలను బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ఏడాదయినా ప్రజలు జాగరూకతలను పాటించడం లేదు . పోలీసులు ఫైన్ వేస్తామని హెచ్చరించడం లేదా లాఠీ ఝళిపించడం చేయాల్సి వస్తోంది . చలానా విధిస్తారన్న భయం లేకుండా పోతోంది . తాజా కేసులు చూస్తుంటే కరోనా ఉధృతి మరోమారు తీవ్రంగా ఉంది . వ్యాక్సిన్ వచ్చినా ఫ్రీగా వేస్తున్నా కూడా ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు […]వివరాలు ...

సాహిత్యం

డా. అంబేద్కర్ జాతీయ పురస్కార గ్రహీత ఆచార్య ‘దార్ల’తో ఇంటర్వ్యూ

 భూమిపుత్ర  శ్రీహరి మూర్తి (శ్రీహరి): భారతీయ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు ప్రదానం చేసిన ‘డా.అంబేద్కర్ జాతీయ పురస్కారం’ స్వీకరించిన సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. ఇంతకు ముందు అందుకున్న పురస్కారాల కన్నా దీన్ని అందుకోవడం పట్ల ఏమైనా ప్రత్యేకత ఉన్నట్లు భావిస్తున్నారా? ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (దార్ల): మీ శుభాకాంక్షలను నా ధన్యవాదాలు. నిజానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుండి నేను కొన్ని పురస్కారాలను స్వీకరించినా, ఇది నా కుటుంబం అందిస్తున్న పురస్కారంగా భావిస్తున్నాను. నేనెంతో […]వివరాలు ...

అభిప్రాయాలు

భూమిపుత్ర దినపత్రిక – సాంస్కృతిక చైతన్య పుత్రిక

సాకే శ్రీహరి మూర్తి  అంకితభావం గల పాత్రికేయుడు మాత్రమే కాదు, ఆయన అంతకుమించి పర్యావరణ ప్రేమికుడు.రాయలసీమ జాగృతి మాస పత్రికను నడిపేవారు. దానికి ఐ.ఎస్.ఎస్.ఎన్ నెంబర్ కూడా ఉంది. దానిలో అనేకమంది పరిశోధక విద్యార్థులు, ప్రొఫెసర్స్, రచయితలు మంచి మంచి వ్యాసాలు రాశారు. జాగృతి మాస పత్రికలో రాయలసీమ కు సంబంధించిన చారిత్రక వాస్తవాలను దృశ్యాత్మక కథనాలతో ఎంతో అద్భుతంగా ప్రచురించేవారు. ఒక వ్యాసాన్ని వేస్తే దానికి సంబంధించిన అరుదైన ఫోటోలను సేకరించి వేయడం ఆ పత్రికలో […]వివరాలు ...

జాతీయం

బెంగాల్‌, తమిళనాడుల్లో నూ ఇంటింటికీ రేషన్‌

భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: ప్రతి రాష్ట్రంలో రేషన్‌ అనేది ఓటర్లను ఆకట్టుకునే ప్రధాన అస్త్రం. అయితే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న పథకాలను తమ హామీల్లో ఇతర రాష్ట్రాల పార్టీ నేతలు గుప్పించడం విశేషంగా కన్పిస్తుంది. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. అనేక ఉచిత పథకాలతో సహా రేషన్‌ సరుకులు కూడా తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలుగా మలుచుకున్నాయి.ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ […]వివరాలు ...

సినిమా

”రామసక్కనోళ్లు” చిత్రం నవ్విస్తూనే ఉద్వేగానికి లోను చేస్తుంది -చమ్మక్ చంద్ర

భూమిపుత్ర,సినిమా: చమ్మక్‌చంద్ర, మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రామసక్కనోళ్లు’. ఫహీమ్‌ సర్కార్‌ దర్శకుడు. రమణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తుమ్ముల ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చమ్మక్‌చంద్ర మాట్లాడుతూ ‘రామసక్కనోళ్లు నలుగురు కుర్రాళ్ల కథ. ఊరి బాగు కోసం వారు ఎలాంటి పోరాటం చేశారన్నది ఆకట్టుకుంటుంది. నవ్విస్తూనే ఉద్వేగానికి లోను చేస్తుంది. ఘంటాడి […]వివరాలు ...

సినిమా

వకీల్ సాబ్’’ డబ్బింగ్ పూర్తి

భూమిపుత్ర, సినిమా: దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘‘వకీల్ సాబ్’’. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు-శిరీష్ నిర్మించగా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు.ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు పూర్తి చేశారు.దీంతో ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ […]వివరాలు ...

సంపాదకీయం

కేంద్రంపై మారుతోన్న వైసీపీ వైఖరి

భూమిపుత్ర, సంపాదకీయం: వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ, టిఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా కేంద్రంపై ఒత్తిడిని మొదలు పెట్టింది. తద్వారా ఎదురయ్యే ఇబ్బందులకు కూడా సిద్ధపడినట్లే కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో వ్యూహాలు నడిపే ప్రశాంత్‌ కిశోర్‌ ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు క్రమక్రమంగా బీజేపీపై , కేంద్రంపై దాడులు పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పూర్తి స్థాయి సమరానికి సిద్ధం కాలేదు. ఆచితూచి అడుగు వేస్తూనే అదను చూసి కొట్టాలనుకుంటోంది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

అటానమస్ కాలేజీలలో సొంత ప్రశ్నపత్రాలు,మూల్యాంకనం రద్దు

భూమిపుత్ర,తాడేపల్లి: అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో తట్టుకునేలా నైపుణ్యానికి పెద్దపీట వేస్తున్నామని, విద్యార్థుల్లో స్వయంప్రతిపత్తి కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరేందుకు పరిధులు దాటి ఆన్‌లైన్‌ క్లాస్‌లు,ఆఫ్‌లైన్‌ క్లాస్‌లు క్రోడికరిస్తూ విధానంలో మార్పులు తెస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు […]వివరాలు ...