సాంకేతికం

బ్లాక్‌ బాక్స్‌ లో డేటా నిక్షిప్తం ఎలా?

భూమిపుత్ర,బ్యూరో: విమాన, చాపర్‌ ప్రమాదాలు జరగగానే బ్లాక్‌ బాక్స్‌ తెరపైకి వస్తుంది. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్‌ బాక్స్‌. ఇప్పటికే బ్లాక్‌ బాక్స్‌ అనేది ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బయటపెట్టాయి. దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్‌ బాక్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై […]వివరాలు ...

జాతీయం

తృతీయ శక్తిగా తృణమూల్ కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను అవకాశంగా మలుచుకుంటున్న దీదీ భూమిపుత్ర, జాతీయం: కాంగ్రెస్‌ పార్టీలో చీలికలు కొత్త కాదు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నిసార్లు చీలిపోయిందో, ఆ అమ్మ కడుపులోంచి ఎన్ని పిల్ల కాంగ్రెస్‌ లు పుట్టుకొచ్చాయో,అందులో ఎన్ని బతికి బట్టకట్టాయో, ఎన్ని మళ్ళీ మాతృ సంస్థలో విలీనం అయ్యాయో.. అదంతా పాత చరిత్ర. నిజానికి ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీగా చెలామణి అవుతున్న సోనియా గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ కూడా, 1969లో మాతృ సంస్థ […]వివరాలు ...

సంపాదకీయం

ప్రతికూల వాతావరణమున్నా ప్రయాణానికి అనుమతి

విచారణలో నిజాలు నిగ్గు తేలితేనే జాతికి ఊరట హెలికాప్టర్‌ ప్రమాదంపై సర్వత్రా అనుమానాలు భూమిపుత్ర,సంపాదకీయం: బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన తీరు..ఆయన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురయిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ప్రతికూల వాతావరణం లోనూ వైమానికదళం ఎందుకు అనుమతించిందన్న ప్రశ్న ఉదయిస్తోంది. తమిళనాడు నీలగిరి జిల్లాలో మంగళవారం వరకూ భారీ వర్షాలు కురిశాయి. దట్టమైన మంచు కూడా కమ్మేసుకుంది. ఎదుటి వారు కనిపించనంతగా మంచు ఉంది. బుధవారం ఉదయం కూడా స్వల్పంగా వర్షం కురిసినట్లు స్థానికులు […]వివరాలు ...

జాతీయం

కుప్పకూలిన డిఫెన్స్‌ హెలికాఫ్టర్‌

హెలికాప్టర్‌లో డిఫెన్స్‌ చీఫ్‌ రావత్‌ భూమిపుత్ర,తమిళనాడు: తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్‌ బేస్‌లో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధి కారులు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యం.. ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు బిపిన్‌ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఆందోళన అవసరం లేదు

అందరికీ వ్యాక్సినేషన్ అత్యవసరం భూమిపుత్ర,అమరావతి: ఒమిక్రాన్‌ తీవ్రమైన వైరస్‌ కాదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసరాజు చెప్పారు. ఇప్పటి వరకు 60 శాతం మందే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతానికి బూస్టర్‌ డోస్‌ అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు.డెల్టాతో పోల్చితే నాలుగు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ప్రమాదకరం కాదని తెలిపారు. ఒమిక్రాన్‌ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని, […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పెరుగుతున్న పీఆర్సీ పరేషాన్

భూమిపుత్ర,విజయవాడ: పీఆర్సీ నివేదిక కోసం కొద్ది రోజులుగా ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్‌ ఝలక్ ఇచ్చారా? రచ్చ చేస్తున్నవారితో చర్చించకుండానే.. కీలక ప్రకటన చేసేశారా? ఆ ప్రకటన తమవల్లే సాధ్యమైందని ఉద్యోగ సంఘాల నాయకులు కాలర్‌ ఎగరేసుకోకుండా సీఎం స్ట్రాంగ్‌ స్ట్రోక్‌ ఇచ్చారా?తాడో పేడో తేల్చుకుంటాం..! ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు..! పీఆర్సీ నివేదిక ప్రకటిస్తారా లేదా అని రోడ్డెక్కి కార్యాచరణ ప్రకటించారు ఐకాసగా ఏర్పడిన ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు. […]వివరాలు ...

వ్యాపారం

వాట్సప్ తో సరుకులు నేరుగా హోం డెలివరీ

వాట్సప్ తో కలిసి జియోమార్ట్ వ్యాపారం భూమిపుత్ర,వ్యాపారం: కిరాణ సరుకుల వ్యాపారంలో మరింత దూసుకెళ్లడానికి రిలయన్స్‌ గ్రూపునకు చెందిన జియోమార్ట్‌ మెసేజ్‌ యాప్‌ వాట్సాప్‌ తో జట్టుకట్టింది. ఆన్‌లైన్‌ గ్రాసరీలో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో పోటీ పడేందుకు వాట్సప్‌ నుంచే కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్‌ యాప్‌లోని ‘‘ట్యాప్‌ అండ్‌ చాట్‌’’ ఆప్షన్‌ను నొక్కి కిరాణా సామాగ్రిని ఆర్డర్‌ చేయవచ్చని జియోమార్ట్‌ తెలిపింది. అయితే 90 సెకన్ల ట్యుటోరియల్‌తో కూడిన ఇన్విటేషన్‌ను వాట్సాప్‌ ద్వారా […]వివరాలు ...

సంపాదకీయం

నిర్లక్ష్యం ఖరీదు వేల నిండు ప్రాణాలు

వీడని విషాదపు ఛాయలు భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో అత్యంత విషాద ఘటనగా, అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ (యుసిఐఎల్‌) పురుగు మందుల ప్లాంట్‌లో గ్యాస్‌ దుర్ఘటన జరిగి 37 ఏళ్ళు. సుమారు 8000 మందికి పైగా మృతి చెందగా 5 లక్షలకు పైగా జనాభా దీని ప్రభావానికి లోనయ్యారని ఒక అంచనా! భోపాల్‌ దుర్ఘటనకు యూనియన్‌ కార్బైడ్‌ యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలే […]వివరాలు ...