రఘురామ బెయిల్‌ పై సుప్రీంలో ముగిసిన వాదనలు

 రఘురామ బెయిల్‌ పై సుప్రీంలో ముగిసిన వాదనలు

భూమిపుత్ర,న్యూ ఢిల్లీ:

సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ వినీత్‌ సరన్‌, జస్టిస్‌ బి. ఆర్‌. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాని ఆదేశాల్లో పేర్కొంది. రఘురామకు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాని ఆదేశించినట్టు సమాచారం. నగరంలోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది ఆదేశాలు వెలువడనున్నాయి.

రఘురామకృష్ణ రాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టుకు సీఐడీ లాయర్‌ దుష్యంత్‌ దవే తెలిపారు. సీనియర్‌ జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలకు సిద్ధమని పేర్కొన్నారు. సమీపంలో ఆర్మీ ఆస్పత్రులున్నాయా అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 300 కి.విూ. దూరంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి ఉందని, విశాఖలో నేవీ ఆస్పత్రి కూడా 300 కి.మిక దూరంలో ఉందని లాయర్‌ రావు తెలిపారు. విశాఖలో తుఫాను పరిస్థితున్నాయని.. కేంద్రం ఆధీనంలోని మంగళగిరి ఎయిమ్స్‌ అన్నింటికంటే దగ్గరగా ఉందని లాయర్‌ దవే వివరించారు. రఘురామకృష్ణ రాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షకు అభ్యంతరం లేదన్నారు. వాదనలు విన్న కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. వాదనులుశుక్రవారం వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇవ్వనుంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *