సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ది స్వయంకృతమా!!

 సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ది స్వయంకృతమా!!

భూమిపుత్ర, గుంటూరు:

ఎవరైనా ఏదైనా వస్తువులు దాచి పెట్టాలని అనుకున్నారంటే అది ఖచ్చితంగా అనుమానాస్పదం అయిందే అయి ఉంటుందనేది పోలీసులకు నేర్పే ప్రాధమిక పాఠాల్లో ఒకటి. ఇది ఐపీఎస్‌లకు తెలీదని అనుకోవడానికి లేదు. తెలుసు మరి ఐపీఎస్‌లకే అలాంటి పరిస్థితి వచ్చినపుడు భిన్నంగా వ్యవహరించకుండా సాధారణమైన వ్యక్తుల్లానే ప్రవర్తిస్తారని ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ నిరూపించారు. ఆయన హిందూమతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వీడియోలను తన క్రైస్తవం గురించి చెప్పిన వీడియోలను సోషల్‌ విూడియా నుంచి హఠాత్తుగా డిలీట్‌ చేశారు. దీంతో ఆయన తప్పు చేశారన్న ప్రచారం నిజమైందని సోషల్‌ విూడియాలో చర్చ ప్రారంభమైంది. ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌ మతం మారి రిజర్వేషన్లు పొందుతున్నారని హిందూ మతం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని లీగల్‌ రైట్స్‌ అడ్వైజరీ కన్వీనర్‌ వినయ్‌ జోషి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేసినట్లుగా తెలియగానే అలా సీఐడీ చీఫ్‌ హోదాలో ఉన్న సునీల్‌ కుమార్‌ వీడియోలను సోషల్‌ విూడియా నుంచి తొలగించేలా చేసుకున్నారు. దీనిపై లీగల్‌ రైట్స్‌ అడ్వైజరీ స్పందించింది.

ఈ వీడియోలను తొలగించడం అంటే.. తప్పు చేసినట్లుగా అంగీకరించడమేనని తాము డౌన్‌ లోడ్ చేసిన వీడియోల కాపీలను హోంమంత్రిత్వ శాఖకు సమర్పించామని తెలిపింది. పీవీ సునీల్‌ కుమార్‌ క్రిస్టియన్‌ మతాన్ని ఆచరిస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. క్రిస్టియానిజాన్ని భారత్‌కు అందించిన బ్రిటిష్‌ వారిని వేనోళ్ల పొగుడుతూ క్రీస్తును ఎంతో స్తుతించినట్లు, హిందూమతం లోని దురాచారాలను ఖండిస్తూ ఆయన ప్రసంగాలు చేసిన నీడియోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయని సమాచారం. ఆయన అలా తొలగించిన విషయం తెలియగానే పెద్ద ఎత్తున ఆ వీడియోలను ఇతరులు అప్‌ లోడ్‌ చేయడం ప్రారంభించారు. దీంతో సీఐడీ సునీల్‌ పరిస్థితి మరోరకంగా తయారైంది. సోషల్‌ విూడియాలో తాను పెట్టిన వీడియోలను డిలీట్‌ చేస్తే తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు అవుతుంది కానీ ఆ వీడియోలను లేకుండా చేయడం సాధ్యం కాదని ఆయన గుర్తించలేకపోయారు. ఐపీఎస్‌ పోలీసు శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా కాకుండా సాధారణ వ్యక్తిగానే ఆలోచించారని విశ్లేషకులు అంటున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *