ఆదిపురుష్‌ సంగీతం పై ప్రత్యేక శ్రద్ద

 ఆదిపురుష్‌ సంగీతం పై ప్రత్యేక శ్రద్ద

భూమిపుత్ర, సినిమా:

ఓం రౌత్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న బాలీవుడ్‌ మూవీ ’ఆది పురుష్‌’ నిర్మాణానికి సంబంధించి రోజుకో వార్త సంచలనం కలిగిస్తున్నాయి. దీనికి బాలీవుడ్‌ సంగీత ద్వయం సాచెత్‌ తాండన్‌ – పరంపరా ఠాకూర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారని బీటౌన్‌ విూడియాలో ప్రచారమవుతోంది. వీరు ఇంతకముందు ఓం రౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ’తన్హాజీ’కి సంగీతమందించారు. అలాగే ప్రభాస్‌ నటించిన సాహోలోని ’సైయాన్‌ సైకో’ పాటను అందించారు. ఈ రకంగా ప్రభాస్‌తోనూ మంచి బాండింగ్‌ ఉంది. అందుకే ’ఆది పురుష్‌’కి సంగీతం అందించే బాధ్యతలను సాచెత్‌ తాండన్‌ – పరంపరా ఠాకూర్‌లకు అప్పగించినట్టు తెలుస్తోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇందులో ప్రభాస్‌ శ్రీరాముడిగా, బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ సీత పాత్రలో నటిస్తున్నారు. రావణుడిగా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటిస్తుండగా, టీ-సిరీస్‌ బ్యానర్‌ పై భూషణ్‌ కుమార్‌ కృష్ణ కుమార్‌ ప్రసాద్‌ సుతార్‌ రాజేష్‌ నాయర్‌ ఓం రౌత్‌ భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా చిత్ర షూటింగ్‌ నిలిచిపోయింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *