యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు శాఖ అధ్యక్షుడుగా ఆచార్య దార్ల

 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు శాఖ అధ్యక్షుడుగా ఆచార్య దార్ల

బాధ్యతలు స్వీకరిస్తున్న ఆచార్య దార్ల

భూమిపుత్ర,హైదరాబాద్:

ప్రఖ్యాత హెచ్ .సి.యూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) తెలుగు శాఖ నూతన అధ్యక్షుడిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలే ఆదేశాల మేరకు సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి మూడు సంవత్సరాల పాటు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ మాజీ డీన్ ఆచార్య ఎస్ శరత్ జ్యోత్స్నా రాణి, విశ్వవిద్యాలయ యాంటీ డిస్ర్కిమినేషన్ చైర్మన్ ఆచార్య ఎం.గోనానాయక్, హెచ్ సి యూ భద్రతా కమిటీ చైర్మన్ ఆచార్య సర్రాజు తెలుగు అధ్యాపకులు ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య బి.విజయలక్ష్మి, దళిత విద్యార్థి సంఘం నాయకులు సుమన్, వేణు, రాణా అఖిలభారత ఒడిసి విద్యార్థి సంఘం నాయకులు కిరణ్ కుమార్, అరుణ్ కేతన్, అంజయ్య, పవన్, లక్ష్మణ్ , పరిశోధకులు రామ్ ప్రసాద్ నలసాని, జి.కృష్ణవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి కృష్ణ, మాజీ తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య జి.అరుణకుమారి, డా.బి.భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు శాఖ మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందనే ఆశాభావాన్ని యూనివర్సిటీ అధ్యాపకులు సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యక్తం చేశారు. తన విధులను విశ్వవిద్యాలయ నియమ నిబంధనలను అనుసరించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు వచ్చేలా తనవంతు కృషి చేస్తానని శాఖాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.

Related News

6 Comments

 • మా గురువుగారు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా నియమితులైన విషయాన్ని వెంటనే ప్రచురించడం చాలా సంతోషంగా ఉంది.

  మీకు మా కృతజ్ఞతలు.

  • thank you so much

  • Namassumanjali guruvulu telugu vibhaganiki adykshuluga niyamitulainanduku santhosham krutagnatalu

   • ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు HoD తెలుగు శాఖ అధ్యక్షులు అయ్యారన్న సమాచారం
    (01-06-2021,) ఇంత త్వరగా అందించి నందులకు మీకు నా అభినందనలు.

 • గురువు గారికిశుభాకాంక్షలు💐💐

 • ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు HoD తెలుగు శాఖ అధ్యక్షులు అయ్యారన్న సమాచారం
  (.01-06-2021,) ఇంత త్వరగా అందించి నందులకు మీకు నా అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.