వివాహిత పిల్లలతో సహా ఆత్మహత్య

 వివాహిత పిల్లలతో సహా ఆత్మహత్య

పాత ఫోటో

భూమిపుత్ర, చిత్తూరు:
కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి, జీవితంపై విరక్తి చెంది ఓ వివాహిత తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్వారీ గుంతలో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం మండలం లో సంచలనం లేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా ఓ తల్లి ఆత్మహత్య కు పాల్పడింది. ముగ్గురు కూడా క్వారీ గుంటలో శవాలై తేలారు. ఈ సంఘటన మండంలో కలకలం రేపింది. రామచంద్రాపురం మండలం రామాపురం పంచాయితీ పరిధిలోని అన్నాస్వామి చెరువు పక్క క్వారీ గుంతలో పడి తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పెనుమూరు మండలం, గుడియానం పల్లెకు చెందిన బి.కిపోర్‌ భార్య నీరజ( 36), కూతురు చైత్ర (7), కుమారుడు చందు (3) శవాలై తేలారు. నీరజ స్విమ్స్ లో నర్సుగా పని చేస్తూ ఏడాది క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే ఏమి జరిగిందో తెలియదు ఆదివారం నుంచి ఆమె కనిపించకుండాపోయింది. పిల్లలతో సహా ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. భర్త కిషోర్‌ ఆదివారం పెనుమూరులో తన భార్యా పిల్లలు కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్నారు.

అయితే మంగళవారం ఉదయం వారు తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం మండలం సి.రామాపురం ఓ క్వారీ గుంతలో శవాలై తేలారు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, పెనుమూరు నుంచి నీరజ నేరుగా తిరుపతి వైపు తన స్కూటీలో వచ్చి అక్కడే ఉన్న ఒక షెడ్డు వద్ద స్కూటర్ ను పార్కు చేసింది. పక్కనే ఉన్న క్వారీ గుంతలో నీళ్ళు అధికంగా ఉండడంతో అందులో దూకి మరణించినట్లు తెలుస్తోంది. బహుశా ఆదివారమే దూకి ఉండవచ్చునని తెలుస్తోంది. పిల్లలు ఇద్దరు, నీరజ కూడా శవాలై తేలారు. మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు శవాలను వెలికి తీయించారు. నీరజ భర్త కిషోర్‌ కూడా ఎక్ట్రికల్‌ డిపార్టుమెంటులో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసేవాడు. ఆ తరువాత దానికి రాజీనామా చేసి ఇంటి వద్దే కోళ్ళఫారంను ఏర్పాటు చేసుకున్నారు. ఈ తరుణంలో ఇద్దరి మధ్యన కలహాలు ఏర్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రామచంద్రపురం ఎస్‌ఐ జయ స్వాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *