పోలీస్ స్టేషన్లే ఆ మహిళా విలేకరి అడ్డా

 పోలీస్ స్టేషన్లే ఆ మహిళా విలేకరి అడ్డా

మీడియా ముసుగులో మహిళా విలేకరి పంచాయితీల పర్వం

భూమిపుత్ర,కడప:

గత మూడు సంవత్సరాల నుంచి మీడియా ముసుగు వేసుకున్న ఒక మహిళ కడప నగరం లోని పోలీస్ స్టేషను లను అడ్డాగా మార్చుకొని పంచాయతీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.పేరు ఊరు లేని ఛానల్స్ లో మొన్నటి వరకు పనిచేసిన ఆమె ఈ మధ్యనే స్థానిక ఛానల్ లో చేరి దాని ద్వారా పలువురు పోలీసు అధికారులను ఇంటర్యూలు చేశారని సమాచారం.అందరి రిపోర్టర్ లకు ఇచ్చినట్లే ఆమె కు కూడా పోలీసు అధికారులు ఇంటర్వూ లు ఇచ్చారు.ఇదే ఆమెకు కల్పతరువు అయ్యింది. అమాయకులను ఆసరా చేసుకొని నిత్యం పోలీసు స్టేషన్ల లో పంచాయితీలు చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తోందని ఆనోటా ఈనోటా చర్చలు విస్తృతంగా నడుస్తున్నాయి. నిజం తెలిసిన తర్వాత ఆ అమాయకులు తమ నజీబ్ ఇట్లుంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరని రోదిస్తున్నారు.

ఇవేమి స్టేషను అధికారులకు తెలుయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.మా తమ్ముడు , మా భర్త తమ్ముడు అంటూ స్టేషన్ కు ఏవరో ఒకరి తరుపున వకల్తా పుచ్చుకుంటోందని పలువురు మీడియా సిబ్బంది వాపోతున్నారు.పోలీసు అధికారులకు ఇవేమి లోతుగా తెలియడం లేదు.దీంతో ఆ మహిళా విలేకరి భాగోతాలు బయటపడటం లేదు.నగరంలోని ఓ పోలీసుస్టేషన్ పరిధిలో ఆమె భర్త తో కలిసి అనేక మంది ద్వారా సెటిల్మెంట్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఆమెను స్టేషను మెట్లు ఎక్కి అక్కడ పంచాయితీలు చేయకుండా పోలీసు అధికారులు నిలవరించకపోతే మీడియా పరువుతో పాటు పోలీసుల పరువు కూడా గంగలో కలవడం ఖాయమని మీడియా సోదరులు వాపోతున్నారు.ఆ మహిళ పై చర్యలు తీసుకోవాలని పలువురు చర్చించుకుంటున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *