కాంగ్రెస్ చేజిక్కిన అవకాశాల్ని జారవిడుచుకుంటోందా!!

 కాంగ్రెస్ చేజిక్కిన అవకాశాల్ని జారవిడుచుకుంటోందా!!

తాజా పరిణామాలతో కునుకు లేకుండా పోతున్న కాంగ్రెస్‌

భూమిపుత్ర,న్యూఢిల్లీ:

పంజాబ్‌ పరిణామాలు మళ్లీ కాంగ్రెస్‌లో సెగపుట్టిస్తున్నాయి. పంజాబ్‌లో అమరీందర్‌ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి చన్నీ ప్రమాణం, సిద్దూ రాజీనామాల వ్యవహారంలో కాంగ్రెస్‌కు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌ఘడ్‌లోనూ అసమ్మతి బీజం పడింది. మొత్తంగా కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య.. ఆ పార్టీపై నమ్మకాలు సడలుతున్నాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా ఎందుకనో ఆయన ప్రచారాలకు, ప్రసంగాలకు పెద్దగా స్పందన రావడంలేదు.అధికార పక్ష వైఫల్యాలను ఒడిసిపట్టుకుని ప్రజాపోరాటాలు నిర్మించవలసిన రాహుల్ అడుగులు ఎందుకో ఇంకా తడబడుతున్నట్లే ఉన్నాయి. వరుసగా పదేళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ అవినీతి, కుంభకోణాలలో కూరుకుపోయి భ్రష్టుపట్టిపోవడం వల్లనే ఆ పార్టీకి గానీ, వారి నాయకుడు రాహుల్‌గాంధీకి గానీ విశ్వసనీయత లేకుండా పోయింది.ఆ మరకను చెరిపివేసే ప్రయత్నం చేయలేదు. దీనికితోడు రాహుల్‌ నాయకత్వంపై సొంతపార్టీలోనే పెద్దగా ఆశలు లేకుండా పోతున్నాయి. అందుకే రాహుల్‌గాంధీ ఏది మాట్లాడినా పెద్దగా స్పందన రావడంలేదు.నిజానికి కాంగ్రెస్‌ చిత్తశుద్దితో ఉండి వుంటే ప్రజల వెన్నంటివుండి ఉద్యమించేది. కాంగ్రెస్‌ పార్టీకి అంత నిజాయితీ లేదని తేలిపోయింది. తమ కోసం పోరాటం చేస్తుందని ప్రజలు కూడా భావించడం లేదు. జాతీయ స్థాయిలోనే కాకుండా ఆయా రాష్టాల్రలో కూడా ప్రతిపక్షాలకు విశ్వసనీయత లేకపోవడం వల్ల ప్రజా ఉద్యమాలను నిర్మించలేక పోతున్నారు. వారసత్వ రాజకీయాలనే నమ్ముకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని కష్టాల కడలినుండి బయటికివేయడం దుస్సాధ్యమైన పని.

రాజకీయ ప్రయోజనం ఎంత, ఎలా పొందవచ్చునన్న ధ్యాసలోనే రాజకీయపార్టీలు ఉంటాయి. అందుకే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని కుదిపేస్తున్న అనేకానేక సమస్యలకు ఉపశమనం లభించడం లేదు. అందుకే ఎవరెన్ని ప్రకటనలు చేసినా, విమర్శలను చేసినా ప్రభావం చూపలేకపోతున్నారు. రాహుల్‌ ప్రకటనలకు స్పందన లేకపోవడానికి ఇదే కారణంగా చూడాలి. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బిజెపి వర్గాలు భావిస్తున్నట్టుగా ప్రజలు నిజంగానే వారివైపు ఉన్నారా? అన్నది అంచనావేసుకోవాలి. ప్రస్తుత కష్టాలను ఎంత కాలమైనా భరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అన్నది తెలుసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి మందగించినా తర్వాత పరుగులు పెడుతుందా? సామాన్యుల జీవితాల్లో వెలుగులు నిండుతాయా? వ్యాపారాలు తిరిగి పుంజుకుంటాయా? అన్నది అంచానా వేయాలి. నోట్ల రద్దు నిర్ణయం తరవాత దేశంలో ఇకపై నల్లధనమనేది ఉండదన్న ప్రచారం ఉత్తిదే అని తేలింది. అయితే దేశ వాస్తవ ఆర్థిక పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయనడానికి దేశంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. కరోనా అనంతర కష్టాల నుంచి జనం ఇంకా కోలుకోలేదు. అప్పుడే ధరలు మంటపెట్టాయి. పెట్రో,గ్యాస్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇకపోతే ప్రభుత్వ ఆస్తుల తెగనమ్మడం అన్నది మరింత భారం కానుంది.

Related News

1 Comment

  • Honesty is not required for people of india they want and welcomed only “Lies”
    Cong give “Lie” promise statement to pay every person 10,000 per month in india they welcomed honestly then only public turned to congress that is our “MAKE IN INDIA” made By Bjp
    Jai Hind
    Jai Congress

Leave a Reply

Your email address will not be published.