వీర్‌చక్ర అవార్డు అందుకున్న వర్థమాన్‌ అభినందన్‌

 వీర్‌చక్ర అవార్డు అందుకున్న  వర్థమాన్‌ అభినందన్‌

భూమిపుత్ర,న్యూఢిల్లీ:

పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారతీయ వైమానిక దళ పైలెట్‌, వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ అభినందన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీర్‌ చక్ర అవార్డును అందజేశారు. ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో అభినందన్‌ ఆ అవార్డును స్వీకరించారు. 2018, మే 19వ తేదీ నుంచి మిగ్- 21 బైసన్‌ స్క్వాడ్రన్‌లో అభినందన్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. 2019, ఫిబ్రవరి 27వ తేదీన.. ఎల్వోసీ వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16, ఎఫ్‌-17 యుద్ధ విమానాలను అభినందన్‌  తన వద్ద ఉన్న రేడార్‌తో శత్రు దేశ విమానాల రాకను పసికట్టాడు.  ముప్పు ఉందని గ్రహించిన అభినందన్‌.. చాలా సాహసోపేతంగా, ఎంతో చాకచక్యంగా తన వద్ద ఉన్న మిస్సైల్‌తో ఎఫ్‌-16ను కూల్చేశాడు. బాలాకోట్‌ వైమానిక దాడుల నేపథ్యంలో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *