తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటాం- వైఎస్ జగన్

 తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటాం- వైఎస్ జగన్

ఫైల్ ఫోటో

ఆరోగ్యశ్రీ పథకంలోకి బ్లాక్‌ ఫంగస్‌

ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

భూమిపుత్ర,అమరావతి:

ఏపీ లో విస్తరిస్తున్న బ్లాక్‌ఫంగస్‌పై అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని  ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. అదే విధంగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి కూడా అనుమతులను వెంటనే ఇచ్చేలా తగిన ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోటిఫైడ్‌ ఆస్పత్రులను గుర్తించాలన్నారు. డయాబెటిక్‌, విపరీతంగా స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను గుర్తించామని సమావేశంలో అధికారులు వివరించగా, ఆ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

రాష్ట్రంలో కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ ఫీవర్‌ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో వైరస్‌ ఉందని తేలిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు మందులు కూడా అందించండని అన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సదుపాయాలపై దృష్టి పెట్టాలని వాటిలో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం ఆదేశించారు. ఫలితాలు రావాంటే కనీసం నాలుగువారాలు కర్ఫ్యూ ఉండాలని సిం అన్నారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తగిన కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు. కోవిడ్‌తో తల్లిదండ్రును కోల్పోయిన పిల్లల పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి కనీస అవసరాలు తీర్చేలా ఆలోచన చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

కేంద్రం నుంచి మొత్తం 75,99,960 వ్యాక్సిన్‌ డోస్‌ లు రాగా, వాటిలో కోవీషీల్డ్‌ 62,60,400 వ్యాక్సిన్లు కాగా, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు 13,39,560 అని అధికాయి వెల్లడించారు. ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రానికి కోవీషీల్డ్‌ వ్యాక్సిన్లు 6,90,360 కేటాయించగా, అంత కంటే ఇంకా ఎక్కువగా 8,90,360 డోస్‌ లు సేకరించామని వారు తెలిపారు. మరోవైపు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోస్‌ లు 2,27,490 కేటాయించగా, కేవలం 1,25,000 మాత్రమే సరఫరా చేశారని అధికారులు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌ లు పాల్గొన్నారు.

 వైద్య ఆరోగ్యశాఖ మంత్రి     ఆళ్ళ నాని మాట్లాడుతూ    ఉదయం 6 గంట నుంచి మధ్యాహ్నం 12 గంట వరకే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాని సీఎం ఆదేశించిందన్నారు. పాజిటివ్‌ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్‌ సర్వే చేస్తున్నామని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో మరింత పకడ్బంధీగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్లనాని చెప్పారు. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ప్లిు అనాథలేతే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. పదివేల ఆక్సిజన్‌ కాన్సన్‌ ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఈనెలాఖరు కల్లా 2వేకు పైగా ఆక్సిజన్‌ కాన్సన్‌ ట్రేటర్స్‌ రాబోతున్నాయని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసును వెంటనే గుర్తించి నివారణ చర్యు తీసుకోవాని సీఎం ఆదేశించార న్నారు. బ్లాక్‌ ఫంగస్‌ నివారణకు వాడే మందులను సమకూర్చాని సీఎం ఆదేశించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *