కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు

 కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు

నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి

పోలీసుల కన్నుగప్పి వ్యాపారాల నిర్వహణ

భూమిపుత్ర , కడప :

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది . కడప కార్పొరేషన్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి . దీంతో పోలీసులు నగరంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసి వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నార ఎ . జిల్లాలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా , కర్ఫ్యూ సమయంలోనూ ఇష్టానుసారంగా ప్ర ధాన రహదారిపై వాణిజ్య సముదాయాలు తెరుస్తుండడంతో జనం గుమికూడుతున్నారు . పోలీసులు వస్తార న్న భయం లేకుండా కర్ఫ్యూ సమయంలోనూ కాలం వెళ్లదీస్తూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు . కొందరు మాస్కులే లేకుండా తిరుగుతున్నారు . తద్వారా కేసులు పెరిగే అవకాశం ఉంది .

కర్ఫ్యూ అమలులో సిబ్బంది పర్యవేక్షణ కొరవడిందని పలువురు ఆరోపిస్తున్నారు . పోలీసులు , చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు . కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతు న్నారు . పైగా స్థానికంగా ఉన్న వైన్స్ షాపుల వద్దకు వచ్చిన వారు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం లాంటివి చేయడంతో ఇతరులకు ఇబ్బందికరంగా మారుతోంది . పోలీసులు పలుమార్లు మాస్కులు లేనివారిని హెచ్చరించినా మార్పు కనిపించడం లేదు . కర్ఫ్యూ సమయం దాటిన తరువాత కూడా కొందరు రోడ్లపై తిరుగుతున్నారు . మరోవైపు కర్ఫ్యూ వేళలో కొందరు చాటుమాటుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కిందిస్థాయి పోలీసులకు వ్యాపారులు మాముళ్లు ముట్టచెప్పడంతో సిబ్బంది చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు .

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *