కేరళను వణికిస్తున్న తౌక్తా తుఫాను

 కేరళను వణికిస్తున్న తౌక్తా తుఫాను

భూమిపుత్ర,కేరళ:
కేరళ రాష్ట్రంపై తౌక్తా బుసలు కొడుతోంది. అప్పుడే తన ప్రభావాన్ని చూపిస్తోంది. వేగంగా వీస్తున్న గాలులకుతోడు భారీ వర్షం పడుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తా తుఫాను తీవ్ర రూపం దాల్చడంతో కేరళలో శనివారం ఉదయం నుంచి జోరుగా వర్షం పడుతోంది. తౌక్తా తుపాను నేపథ్యంలో కేరళలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కేరళ, కర్ణాటక పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొల్లాం జిల్లాలో తుపాను ధాటికి చెట్లు నేకొరిగాయి. వయనాడ్‌, ఇడుక్కి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళలో లోతట్టు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. గోవాకు 350 కి.విూ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. తౌక్తా తుపాను గుజరాత్‌ తీరం వైపు కదులుతూ బలపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. కేరళలోని మణప్పురం, కోజికోడ్‌, కన్నూర్‌, వయనాడ్‌, కాసర్‌గోడ్‌తో సహా ఉత్తర జిల్లాలో భారీ వర్షం కురిసినట్లుగా ఐఎండీ అంచనా వేసింది. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్‌ అలర్ట్‌, తిరువనంతపురం, పాక్కాడ్‌ జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కోజికోడ్‌ జిల్లాలోని వడకర గ్రామంలో వందల కుటుంబాలతో పాటు లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో కాసరగోడ్‌లో అలలు ఎగిపడుతున్నాయి. రాష్ట్రంలో కొవిడ్‌ -19 ప్రోటోకాల్స్‌ అమలులో ఉన్నందున ప్రస్తుతం సహాయ శిబిరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. తౌక్టా తుఫాను ఈ నె 17-18 మధ్య తీరం దాటుతుందని భావిస్తుండగా.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే తౌక్తా తుపాన్‌ ప్రభావం విస్తారా, ఇండిగో విమాన సర్వీసులపై పడనుంది. తుపాన్‌ ప్రభావం వల్ల తమ విమాన సర్వీసులు రాకపోకలను రద్దు లేదా రీ షెడ్యూల్‌ చేస్తున్నామని విస్తారా, ఇండిగో విమానయాన సంస్థలు ప్రకటించాయి.

శనివారం రాత్రికి తౌక్తా తుపాన్‌ వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రాబోయే రెండు రోజుల పాటు కొన్ని విమాన సర్వీసులను రద్దు లేదా రీ షెడ్యూల్‌ చేస్తున్నామని విస్తారా ప్లయర్స్‌ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారడం వల్ల చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, బెంగళూరు, ముంబై, పూణె, గోవా, అహ్మదాబాద్‌ నగరాలకు విమాన సర్వీసులు మే 17వతేదీ వరకు ప్రభావితం అయ్యే అవకాశముందని విస్తారా వెల్లడించింది. తుపాన్‌ కారణంగా తమ విమాన సర్వీసులను కూడా రద్దు చేసే అవకాశముందని ఇండిగో తెలిపింది. తౌక్తే తుపాన్‌ వ్ల సముద్ర తీరప్రాంతాల్లో గాలులు వేగంగా వీస్తున్నందున విమానా రాకపోకలను రద్దు చేసే పరిస్థితి ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *