అలిపిరి వద్ద మెట్ల మార్గం మూసివేత

 అలిపిరి వద్ద మెట్ల మార్గం మూసివేత

భక్తులు శ్రీవారి మెట్ల మార్గం ఉపయోగించాలన్న టిటిడి

భూమిపుత్ర,తిరుపతి:

తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని టీటీడీ అధికారులు ప్రకటనలో చెప్పారు. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు మంగళవారం నుంచి జూలై 31 వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం . తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని, అటు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద ఇవాళ్టి నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రానుంది. ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య టాక్సీవాలాలతో సమావేశమైన అధికారులు ఫాస్టాగ్‌ అమలుపై సవిూక్ష నిర్వహించారు. దీంతో పాటు పెంచిన కొత్త టోల్‌ చార్జీలను కూడా అమలు చేయనున్నట్లుగా తెలిపారు.గతంలో ద్విచక్ర వాహనాలకు 2 రూపాయల చార్జీ వసూలు చేస్తుండగా ఇకపై ఉచితంగానే వాటిని అనుమతిస్తారు. నాలుగు చక్రాల వాహనాలకు గతంలో 15 రూపాయల చార్జీ ఉండగా ఇకపై 50 రూపాయలు వసూలు చేయనున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published.