సృష్టి, స్థితిని నాశనం చేయగలిగేది కాలమొక్కటే!!

 సృష్టి, స్థితిని నాశనం చేయగలిగేది కాలమొక్కటే!!

భూమిపుత్ర, ఆధ్యాత్మికం:

కాలం అనంతమైనది. పోయిన కాలం రాదు. అందుకే కాలన్ని భగవత్‌ స్వరూపంగా మనవాళ్లు ఆరాధించారు. భగవద్గీతలో పరమాత్మ కృష్ణుడు కాలమహిమను బోధించారు. కాలానికి అమితమైన ప్రభావం ఉంది. అది ముందుకు సాగడమే తప్పవెనక్కి తిరిగి చూడదు. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోకుంటే తరిగి రాదు. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేది, హరించేది కాలమే. సృష్టి, స్థితి, వినాశం చేయగలిగింది కాలమే. బలవత్తరమైన కాల ప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. గతించిన కాలాన్ని తిరిగి పొందలేం. అందుచేత కాల మహిమను మనవాళ్లు బాగా గుర్తించారు. మన రుషులు కాలమహిమపై గొప్పగా భావ వ్యక్తీకకరణ చేశారు. కాలం విలువను గ్రహించాలన్న పెద్దల మాటలను గౌరవించి ముందుకు సాగాలి. కాలం విలువ తెలిసిన రావణాసురుడు లక్ష్మణుడికి ఇదే ఉపదేశం ఇస్తారు.చెయ్యాలనుకున్న పనిని తక్షణమే పూర్తి చేయాలంటారు. అందుకే ఆలస్యం అమృతం విషం అంటారు.

కాలం మహిమను గుర్తించి ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి. ప్రతి వ్యక్తీ కాలస్వరూప వైశిష్ట్యాన్ని గుర్తించి వ్యక్తిత్వ నిర్మాణానికి సాధనంగా చేసుకోవాలి. అత్యంత విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నతుల మవుతాము. నిరుపయోగం చేసుకుంటే విలువైన జీవితం వృథా అవుతుంది. ఏదైనా అది మన చేతులలోనే ఉన్నది. ఆ అవగాహన తోకాలం విలువ తెలుసుకోవడం మంచిది. జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకోవాలి. సంపాదన వెంట పరుగులు తీసే క్రమంలో తాను ఆ సంపదను అనుభవించలేదని, అనుబంధాలను కోల్పోయానని ఎన్నో సంఘటనలు మనకు నిత్యం అనుభవైకమే. కాలానికి అనగుణంగా ముందుకు సాగాలి. కరోనాలాంటి కష్టకాలంలోనూ కాలం విలువ తెలిసి ముందుకు సాగాల్సి ఉంది. లేకుంటే కాలం కాటేస్తుంది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేందుకు అవసరమైన ఉపకరణమే జీవితం. పరిమితమైన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే విజయాలే వెంట నడుస్తాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *