Tags : సుప్రీం కోర్టు

జాతీయం

చర్చలు లేకుండానే చట్టాలు చేయడం దురదృష్టకరం

సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆవేదన సుప్రీకోర్టులో జాతీయ జెండా ఆవిష్కరణ భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: పార్లమెంట్‌ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడారు. ఈ సందర్భంగా […]వివరాలు ...

జాతీయం

ఇంటర్నెట్‌ సదుపాయాలు లేక న్యాయసేవల్లో జాప్యం

అనామలీస్‌ ఇన్‌ లా అండ్‌ జస్టిస్‌’ పుస్తకాన్నిఆవిష్కరించిన సిజె న్యాయవృత్తిలో ఉన్నవారిని కరోనా యోధులుగా గుర్తించాలి – సుప్రీంకోర్టు చీఫ్‌ ఎన్వీ రమణ భూమిపుత్ర,న్యూఢిల్లీ: గ్రావిూణ, గిరిజన, మారుమూల, కొండ ప్రాంతాల్లో బలహీనమైన డిజిటల్‌ అనుసంధానత వల్ల న్యాయ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ఈ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. సాంకేతిక సౌకర్యాల కల్పనలో అసమానతల వల్ల ఒక తరం న్యాయవాదులు […]వివరాలు ...

చదువు

ఇంటర్‌పరీక్షల పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

భూమిపుత్ర, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటువ్యాఖ్యలు చేసింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, దాని వల్ల ఒక్కరు మరణించినా.. కోటి పరిహారం ఇవ్వాలని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధన పాటిస్తున్నట్లు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దంపతులు

భూమిపుత్ర,కర్నూలు: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైలం విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ జి వీరపాండియన్‌ పుష్ప గుచ్చం, పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారిగా దర్శనానికి వచ్చినందున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డిఐజి వెంకటరామిరెడ్డి, […]వివరాలు ...

జాతీయం

సీబీఐ డైరెక్టర్‌ ఎంపికలో ప్రభుత్వానికి చుక్కెదురు

ఆరుమాసాల లోపు సర్వీసు ఉన్నవారిని పదవిలో నియమించరాదన్న సుప్రీంకోర్టు భూమిపుత్ర, న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ ఎంపికలో మెలిక పడినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన తుది జాబితాలో ఇద్దరి పేర్లు తొలగించాని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. సోమవారం సాయంత్రం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఇది జరిగింది. ఆరుమాసాల లోపు సర్వీసు మాత్రమే మిగిలి ఉన్నవారిని సీబీఐ డైరెక్టర్‌ పదవిలో నియమించరాదని సుప్రీంకోర్టు గతంలో […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

గుంటూరు డాక్టర్ల మెడకు ఉచ్చు బిగుసుకోనున్నదా?

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్‌: వైసీపీ అసమ్మతి ఎంపీరఘురామ కృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఆయనకు షరతుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాదప్రతివాదనలు హోరాహోరీగా సాగాయి. ఎంపీ రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. రఘురామ వ్యవహారం గుంటూరు వైద్యుల మెడకు బిగుసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఏపీ హైకోర్టు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఎంపీ రఘురామరాజు కు బెయిల్‌ మంజూరు

షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన సుప్రీం విూడియాతో మాట్లాడరాదని ఆంక్షలు భూమిపుత్ర ,న్యూ ఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జావిూనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్‌ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్‌ తీసుకోవాలని సూచించింది. ఇకపోతే దర్యాప్తు అధికారి పిలిస్తే […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

ప్రజలు పిట్టల్లా రాలుతున్నా రాజకీయాలేనా!!

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో  కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్యమాత్రం తగ్గడం లేదు. అధికారికంగా లెక్కలు ఒకలా ఉంటే వాస్తవ గణాంకాలు వేరుగా ఉన్నాయి. వాక్సిన్‌ అందరికీ అందుబాటులో రాలేదు. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడింది . వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కార్యరూపం దాల్చలేదు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకల విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.హామీలు శుష్క వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి. ఆక్సిజన్‌ అందక వందలాది […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ జాతీయం

రఘురామ బెయిల్‌ పై సుప్రీంలో ముగిసిన వాదనలు

భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ వినీత్‌ సరన్‌, జస్టిస్‌ బి. ఆర్‌. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాని ఆదేశాల్లో పేర్కొంది. రఘురామకు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాని ఆదేశించినట్టు సమాచారం. నగరంలోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అటార్నీ […]వివరాలు ...

జాతీయం

ప్రత్యక్ష ప్రసారాల ప్రయోజనమెంత?

భూమిపుత్ర,జాతీయం: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసి న్యాయవ్యవస్థ పారదర్శకతను సమాజానికి చాటిచెప్పే ప్రక్రియ పరిశీలనలో ఉన్నదని వ్యాఖ్యానించడంతో న్యాయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పైకి చూస్తే ఇది ఆదర్శంగానే కనిపించవచ్చు. పారదర్శకంగా, ప్రజలందరూ న్యాయస్థానాల పనితీరును తెలుసుకుంటే తప్పేమిటని అనిపించవచ్చు. కానీ లోతుగా తరచి చూస్తే పర్యవసానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే న్యాయక్రియాశీలత్వం కారణంగా ప్రభుత్వాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను చవి చూస్తున్నాయి. అయితే విస్తృతమైన […]వివరాలు ...