Tags : విజృంభణ

ప్రపంచం సంపాదకీయం

ఐరోపా దేశాలను వణికిస్తున్న కరోనా

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వైరస్ తన విజృంభణ ను ఇప్పట్లో చాలించేలా కనిపించడంలేదు. మహమ్మారి మరోమారు యూరప్‌ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అక్కడక్కడా పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా సాగుతున్నాయి. చైనాలో సైతం కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలోనూ లెక్కలోకి రాని కేసులు, మరణాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గించి చూపిస్తున్నారు. ఎలాంటి ఉధృతి లేకుండా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి, రెండో వేవ్‌ల కంటే వేగంగా థర్డ్‌వేవ్‌ ఉండబోతోందన్న భయం పాశ్చాత్య దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

తల్లితండ్రుల నుంచి పిల్లలకు కరోనా

భూమిపుత్ర,విజయవాడ: సెకండ్‌ వేవ్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే మిగతా కుటుంబసభ్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. అప్పుడే పుట్టిన వారి నుంచి ఎదుగుతున్న పిల్లల వరకు ఎవరూ వైరస్‌ కి మినహాయింపు కాదని నగరానికి చెందిన పీడియాట్రిషియన్లు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పేరెంట్స్‌ నుంచి ఇంట్లోని చిన్నారులకు వైరస్‌ అటాక్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.అప్పుడే పుట్టిన పిల్లలకు […]వివరాలు ...

సంపాదకీయం

న్యాయస్థానాలదే కీలకపాత్ర

భూమిపుత్ర, సంపాదకీయం: రాజకీయాలలో ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు. లోపాలను ప్రత్యర్థులే పరస్పరం బయటపెట్టుకుంటారు. అధికారపక్షంపై ప్రతిపక్షం, ప్రతిపక్షాపై అధికారపార్టీ నిరంతరం ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. నిజానికి చాలా వరకూ రెండూ నిజమే అయి ఉంటాయి. రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిని తలపిస్తున్నారు అధికార పార్టీ నాయకులు అంటూ ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. ఉపద్రవం ఉప్పెనలా చుట్టుముట్టుతుంటే చుట్ట కాల్చుకుందామనుకునే సంకుచిత‘ నీరో’ మనస్తత్వంతో ప్రవరిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు అంటూ అధికారపార్టీలు విమర్శిస్తున్నాయి. […]వివరాలు ...