Tags : రాజకీయాలు

సంపాదకీయం

జవసత్వాలు పుంజుకుంటున్న న్యాయవ్యవస్థ

భూమిపుత్ర, సంపాదకీయం: వ్యవస్థలు కుమ్మక్కై దేశాన్ని వక్రమార్గం పట్టిస్తున్నాయి. బాధ్యత వహించాల్సిన పాలకులు, అధికారులు అవినీతిలో భాగస్వాములుగా మారుతున్నారు. ఇందులో రాజకీయ నేతలది మొదటి స్థానం. దర్యాప్తు సంస్థలది రెండో స్థానం. నిన్నామొన్నటివరకూ చూసీ చూడనట్లు వ్యవహరించిన సర్వోన్నత న్యాయస్థానం కొరడా ఝళిపిస్తానంటూ హెచ్చరిస్తోంది. చాలా కాలంగా ప్రభుత్వాలు కోర్టు తీర్పులను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. సాకులు వెదుకుతున్నాయి. కోర్టుల విచారణలను ఆలస్యం చేయడం, అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందచేయకుండా నాన్చడం వంటి చర్యల ద్వారా […]వివరాలు ...

సేద్యం

ధాన్యం సేకరణే అసలు సమస్య !!

భూమిపుత్ర,వ్యవసాయం: కొందరు కారణ జన్ములు ఉంటారు. ప్రజల కోసం నిరంతరం తపించే పాలకులు పుడుతారు. మనం పాలన చేసేది ప్రజలకోసమే అన్న ఆలోచనతో ముందుకు సాగుతారు. అందుకు అనుగుణంగా పథకాలు రచిస్తారు. తమ ఆలోచనలు కార్యారూపం దాల్చేలా చేస్తారు. తన ఆలోచనలనకు పదనుపెట్టి ముందుకు నడిచి దానిని సాకారం చేసి జనం నోళ్లల్లో నానుతారు. ఔరా ఎంత మంచి నాయకుడని అనిపించుకుంటారు. పాతతరంలో నాయకులు అలానే చేసే వారు. ఎంతో త్యాగబుద్దితో ముందుకు సాగేవారు. తమ సర్వస్వం […]వివరాలు ...

సంపాదకీయం

నిరుద్యోగ సమస్య పై తక్షణ కార్యాచరణ కావాలి

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా ప్రమాద ఘంటికలు ఇప్పట్లో వదిలేలా లేవు. దేశంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాల్సి ఉంది. ప్రజలందరికి వందశాతం వ్యాక్సిన్‌ పూర్తి కావాలి. అలాగే కరోనా వైరస్‌ మ్యుటేషన్లు పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే దీని పీడ విరగడ అయ్యేలా లేదు. ఇకపోతే ఆయా రాష్ట్రాలు మెల్లగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నాయి. ఈ దశలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. బయట మార్కెట్లో కరోనా ఫ్రీగా అంటుతోంది. అప్రయత్నంగానే అది మనలను, మన కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

ప్రజలు పిట్టల్లా రాలుతున్నా రాజకీయాలేనా!!

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో  కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్యమాత్రం తగ్గడం లేదు. అధికారికంగా లెక్కలు ఒకలా ఉంటే వాస్తవ గణాంకాలు వేరుగా ఉన్నాయి. వాక్సిన్‌ అందరికీ అందుబాటులో రాలేదు. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడింది . వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కార్యరూపం దాల్చలేదు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకల విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.హామీలు శుష్క వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి. ఆక్సిజన్‌ అందక వందలాది […]వివరాలు ...