Tags : ముఖ్యమంత్రి

జాతీయం

సిద్దూ రాజకీయ భవితవ్యంపై అనుమానాలు!!

భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలను బిజెపి అధిష్టానం నిశితంగా గమనిస్తోన్నట్లుంది. అక్కడ సిఎం అమరీందర్‌తో మాజీ మంత్రి నవజోత్ సింగ్‌ సిద్దూకు పొసగడం లేదు. రైతుల సమస్యలను ప్రోత్సహించడం ద్వారా అమరీందర్‌ ఇటీవల వారి ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో వచ్చేయేడు పంజాబ్‌ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బిజెపి ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. సిఎం అమరీందర్‌తో ఉన్న విభేదాల కారణంగా సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు బిజెపికి […]వివరాలు ...

రాయలసీమ

తాడిపత్రి కోవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

చిన్నపాటి వర్షానికే నీరు చేరడంతో ఆందోళన భూమిపుత్ర,అమరావతి/అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సవిూపంలోని ఆర్జాస్‌ స్టీల్‌ వద్ద ఏర్పాటు 500 ఆక్సిజన్‌ పడకల జర్మన్‌ హ్యాంగర్ల ఆస్పత్రిని నిర్మించారు. సీఎం జగన్‌ ఆదేశాలతో 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్లతో కోవిడ్‌ ఆస్పత్రిని నిర్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

రెండేళ్ళ పాలనలో రాష్ట్రం ఎటువైపు?

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: సంక్షేమ పథకాలు వేరు,తాయిలాలు వేరు.వివిధ పథకాల పేరుతో ప్రజలకు నగదు బదిలీ చేయడమన్నది వారిని ప్రలోభాలకు గురిచేయడం తప్ప మరోటి కాదు. చంద్రబాబు హయాంలోనే ఇది మొదలు అయ్యింది. నేరుగా నగదు బదిలీ చేయడం అన్న పద్దతి సరైంది కాదు.దీంతో అభివృద్ది కుంటుపడుతుంది. ఎపిలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సిఎం జగన్‌ పాలనపై ఇటీవలే ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. తాను చేస్తున్న నగదు బదిలీ చర్యలను సంక్షేమ కార్యక్రమంగా సిఎం జగన్‌ సమర్థించుకోవచ్చు.నగదు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

పార్లమెంట్ సభ్యుల పంచాయతీ పరిష్కారమయ్యేదెప్పుడు?

భూమిపుత్ర, అనంతపురం: వైసీపీలో మళ్లీ ఎంపీల మధ్య అలకలు తెరమీదకి వచ్చాయి.కొన్నాళ్ల కిందట ఎంపీల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు సీఎం జగన్ పంచాయితీ చేశారు.అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు సీమలో ఒకరు ఉత్తరాంధ్రలో ఒకరు ఎంపీలు పార్టీ పై గుస్సాగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.వీరిలో ఒకరు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.మరొకరు అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. వీరిద్దరూ కూడా ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా అంటీముట్టనట్టు వ్యవహరించారు.మరి దీనికి ప్రధాన […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ సేద్యం

వైఎస్సార్‌ ఉచిత పంటబీమా నగదు విడుదల

క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌లో జమ చేసిన సిఎం 15.15 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.1,820.23 కోట్లు చేరిక భూమిపుత్ర, అమరావతి: వైఎస్సార్‌ ఉచిత పంట బీమా పథకం కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంట బీమా నగదు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

వ్యవసాయం,సంక్షేమానికి పెద్దపీట

విద్య,వైద్య రంగాలకు పెరిగిన కేటాయింపు మహిళలు,చిన్నారులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భూమిపుత్ర,అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. దీనికి ముందు బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు జరిగిన కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. శాసన మండలిలో హోంమంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్‌ […]వివరాలు ...

జాతీయం

ముఖ్యమంత్రి యోగీకి మఠాధిపత్యమే మిగలనున్నదా?

భూమిపుత్ర ,లక్నో: మోదీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలో కరోనా నియంత్రణను కట్టడి చేయలేకపోయారన్న ఆగ్రహం ప్రజల్లో ఎక్కువగా కనపడుతుంది. ఈ ప్రభావం ఎన్నికలపైన కూడా పడుతుంది. ఇటీవల జరిగిన ఉత్తర్‌ ప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రాంతీయ పార్టీలు ఉత్తర ప్రదేశ్‌ లో పుంజుకోవడం విశేషం.ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఏప్రిల్‌ నెలలో పంచాయతీ ఎన్నికలుజరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వందనం – గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ప్రారంభమైన శాసనసభా సమావేశాలు భూమిపుత్ర, అమరావతి: నేడు ప్రారంభమైన ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అయన కొనియాడారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వే లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్ పై […]వివరాలు ...

జాతీయం

అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ

భూమిపుత్ర,గువాహటి: అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. భాజపా శాసనసభా పక్షం శర్మను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అసోం రాష్ట్ర బీజేపీలో రెండు వర్గాలుగా ఉన్న శర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వశర్మ లలో అమిత్ షా మద్దతున్న బిశ్వశర్మనే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్,మేఘాలయ లలో బీజేపీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మరియు అసోంలో బీజేపీ లో భాజపా గణనీయమైన స్థానాలలో గెలవడానికి విశేషమైన […]వివరాలు ...

జాతీయం

తమిళనాడు 14 వ ముఖ్యమంత్రిగా ఎం.కె.స్టాలిన్

భూమిపుత్ర,చెన్నై: తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ముత్తువేల్ కరుణానిధి. స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 34 మంత్రులు కూడా ప్రమాణం చేశారు.తన తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వారిలో చాలా మందికి మళ్లీ కేబినెట్‌లో అవకాశం దక్కింది. అంతేకాదు 15 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు. […]వివరాలు ...