Tags : మాస్క్

ప్రపంచం సంపాదకీయం

ఐరోపా దేశాలను వణికిస్తున్న కరోనా

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వైరస్ తన విజృంభణ ను ఇప్పట్లో చాలించేలా కనిపించడంలేదు. మహమ్మారి మరోమారు యూరప్‌ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అక్కడక్కడా పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా సాగుతున్నాయి. చైనాలో సైతం కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలోనూ లెక్కలోకి రాని కేసులు, మరణాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గించి చూపిస్తున్నారు. ఎలాంటి ఉధృతి లేకుండా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి, రెండో వేవ్‌ల కంటే వేగంగా థర్డ్‌వేవ్‌ ఉండబోతోందన్న భయం పాశ్చాత్య దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. […]వివరాలు ...

సంపాదకీయం

మన నిర్లక్ష్యమే మన ప్రాణాలకు ముప్పు!!

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో కరోనా సృష్టించిన గందరగోళం ఇంకా తొలగిపోలేదు.ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ లు విధించి చేతులు దులుపుకుంటున్నాయి. నిర్లక్ష్యం జాడ్యం నుంచి ప్రభుత్వాలు బయటపడడం లేదు.అధికారుల ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ నాయకులు అంతా బాగుందని మిన్నకుంటున్నారు. కరోనా కట్టడి చర్యలపై సుప్రీంకోర్టు, ఆయా రాష్ట్రాల హైకోర్టులు ప్రభుత్వాలను గట్టిగానే నిలదీస్తు న్నాయి.అయినా ప్రైవేట్‌ ఆస్పత్రులు యధావిధిగానే తమ వసూళ్లను మరింత ముమ్మరం చేస్తున్నాయి.కేసు వస్తే చాలు నొక్కేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.ఇక చనిపోతే […]వివరాలు ...

ఆరోగ్యం

మందులేని జబ్బుకు అంత డబ్బెందుకు?

భూమిపుత్ర, ఆరోగ్యం : మందులేని జబ్బుకు అంతింతేసి డబ్బులు ఖర్చు ఎందుకవుతాయని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు.వీళ్ళకు ఏదైనా ఒక జబ్బు అంటే ఏమిటో మానవ శరిరం అంటే ఏమిటో అణులేశమాత్రం కూడా తెలియదు అని చెప్పవచ్చు. అందుకే అలా మాట్లాడుతూ ఉంటారు.”కూరలో ఉప్పు లేదు. ఉప్పువేస్తే సరిపోతుంది కదా!” అని అనుకున్నంత సులువుగా మన శరీరంగానీ ఒక జబ్బుకానీ ఉండవు.ఉదాహరణకు కరోనా. కరోనా అనేది మన శ్వాస వ్యవస్థలో పై భాగాలకు సోకే జబ్బు. అంటే […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

అపోహలు వీడండి- కోవిడ్ పై పోరాడండి

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్ : కోవిడ్‌ సెకండ్ వేవ్ తో మన దేశం అల్లాడుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సగానికిపైగా రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ వైపే మొగ్గు చూపాయి. ఇటు మన రాష్ట్రంలో కూడా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావానికి గురై కొందరు, ఆక్సిజన్ అందక మరికొందరు ఇలా రోజుకు వేలాది మంది మరణిస్తున్నారు. కోవిడ్ వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ అనేకమందికి కోవిడ్ వైరస్ పై పూర్తిగా అవగాహన ఉండడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరి […]వివరాలు ...

సంపాదకీయం

ప్రజల నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తోందా!!

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వ్యాప్తి కి ప్రధానంగా ప్రజల నిర్లక్ష్యమే కారణమని గతేడాదిగా జరుగుతున్న పరిణమాలను బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ఏడాదయినా ప్రజలు జాగరూకతలను పాటించడం లేదు . పోలీసులు ఫైన్ వేస్తామని హెచ్చరించడం లేదా లాఠీ ఝళిపించడం చేయాల్సి వస్తోంది . చలానా విధిస్తారన్న భయం లేకుండా పోతోంది . తాజా కేసులు చూస్తుంటే కరోనా ఉధృతి మరోమారు తీవ్రంగా ఉంది . వ్యాక్సిన్ వచ్చినా ఫ్రీగా వేస్తున్నా కూడా ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు […]వివరాలు ...