Tags : . బీజేపీ

జాతీయం

తమిళనాట బీజేపీ ఎత్తులు ఫలించేనా!!

భూమిపుత్ర,జాతీయం: చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో తమ రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచించే బీజెపి ఇప్పుడు దేశంలో మరో రాష్ట్ర విభజనకు ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య విజభన జరిగింది. ఏదో ఒక రూపంలో నిత్యం రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంటోంది. చాపకింద నీరులా బిజెపి తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. దక్షిణ తమిళనాడులో రెండో రాజధాని కావాలంటూ డిమాండ్‌ వినిపించినా ఆ వాదనకు పెద్దగా మద్దతు లభించలేదు. తాజాగా అదే తమిళనాడు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

పొలిటికల్ మల్టీస్టారర్ తో బ్యాలట్ బాక్స్ బద్దలేనా!!

భూమిపుత్ర, ఆంధ్రప్రదేశ్: సినిమాల్లో మల్టీస్టారర్‌ కి ఎపుడూ విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు టాప్‌ హీరోల అభిమానులు కలసి సినిమాను చూస్తారు. గ్యారంటీగా బొమ్మ బాక్స్‌ బద్దలు కొడుతుందన్న లెక్కలేవో ఉంటాయి. రాజకీయాల్లో అలాంటి మల్టీ స్టారర్లు హిట్లు అయ్యాయా అంటే కొన్ని చోట్ల జరిగాయి. కానీ చాలా సార్లు ఫెయిల్‌ అయ్యాయి. ఈ మధ్యనే తమిళనాడు లో కమల్‌ హాసన్‌ శరత్‌ కుమార్‌ ల పొలిటికల్‌ మల్టీ స్టారర్‌ ని జనం తిరస్కరించారు. దాని […]వివరాలు ...

సంపాదకీయం

ఉత్తరప్రదేశ్ విభజన బీజేపీని గెలిపిస్తుందా!!

భూమిపుత్ర,సంపాదకీయం: భారతీయ జనతాపార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఉత్తరప్రదేశ్‌. 2022 ప్రథమార్థంలో జరిగే శాసనసభ ఎన్నికలపైనే 2024 లోక్‌ సభ ఎన్నికలూ ఆధారపడి ఉంటాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ సుస్థిరపాలనకు ఉత్తరప్రదేశ్‌ ఊతమిస్తోంది. ఈ రాష్ట్రంలో లభించిన మెజార్టీనే దేశంలో బీజేపీని తిరుగులేని శక్తి గా మార్చింది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌ లో ఓటమి పాలైతే ఆ తర్వాత రెండేళ్లు కేంద్రంలో కూడా పరిపాలన సజావుగా సాగదు. అస్థిరత […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ జాతీయం

పవన్‌ కు కేంద్ర మంత్రి పదవి గాలి కబుర్లేనా?

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా బలపడాలని యోచిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల తిరుపతి ఉపఎన్నికల ఫలితంతో ఏపీలో గెలుపు అంత సులువు కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ ఏపీ నుంచి కీలక నేతల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతుండగా మోదీ కేబినెట్లో ఏపీ నుంచి ఒక్కరూ కూడా లేరు. దీంతో ఆ […]వివరాలు ...

తెలంగాణ

కాషాయ కండువా కప్పుకున్న ఈటెల

భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, తరుణ్‌ చుగ్‌ సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. తన మద్దతు దారులతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇటీవల టీఆర్‌ఎస్‌కి గుడ్‌ బై చెప్పిన ఈటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ చుగ్‌ బీజేపీ […]వివరాలు ...

జాతీయం

సిద్దూ రాజకీయ భవితవ్యంపై అనుమానాలు!!

భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలను బిజెపి అధిష్టానం నిశితంగా గమనిస్తోన్నట్లుంది. అక్కడ సిఎం అమరీందర్‌తో మాజీ మంత్రి నవజోత్ సింగ్‌ సిద్దూకు పొసగడం లేదు. రైతుల సమస్యలను ప్రోత్సహించడం ద్వారా అమరీందర్‌ ఇటీవల వారి ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో వచ్చేయేడు పంజాబ్‌ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బిజెపి ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. సిఎం అమరీందర్‌తో ఉన్న విభేదాల కారణంగా సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు బిజెపికి […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

రఘురామరాజు చూపు తెలుగుదేశం వైపు

భూమిపుత్ర, విజయవాడ: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు దారి దొరికింది. ఆయన తనకు అండగా నిలిచిన టీడీపీ వైపు వెళ్లాలని యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి తానేంటో చూపిస్తానని సన్నిహితుల వద్ద రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అప్పటివరకూ వైసీపీలోనే ఉండి ఆ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలే నిర్వహించాలన్నది రఘురామకృష్ణంరాజు ఆలోచనగా ఉంది. తనను అక్రమంగా అరెస్ట్‌ చేయడంతో ఆయన రానున్న కాలంలో మరింత రెచ్చిపోతున్నారని తెలిసింది.రఘురామకృష్ణంరాజు ఇప్పటివరకూ బీజేపీకి ఒకింత మద్దతుగా […]వివరాలు ...

జాతీయం

ముఖ్యమంత్రి యోగీకి మఠాధిపత్యమే మిగలనున్నదా?

భూమిపుత్ర ,లక్నో: మోదీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలో కరోనా నియంత్రణను కట్టడి చేయలేకపోయారన్న ఆగ్రహం ప్రజల్లో ఎక్కువగా కనపడుతుంది. ఈ ప్రభావం ఎన్నికలపైన కూడా పడుతుంది. ఇటీవల జరిగిన ఉత్తర్‌ ప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రాంతీయ పార్టీలు ఉత్తర ప్రదేశ్‌ లో పుంజుకోవడం విశేషం.ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఏప్రిల్‌ నెలలో పంచాయతీ ఎన్నికలుజరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో […]వివరాలు ...

జాతీయం

మమతకు ముందున్నవన్నీ సవాళ్ళే

పక్కలో బల్లెంగా బీజేపీ భూమిపుత్ర, కోల్‌కతా: బెంగాల్‌ ఎన్నికలు మమతా బెనర్జీని మరోమారు ప్రజల్లో తిరుగులేని నేతగా నిలిపాయి. ప్రజల్లో ఆమెపట్ల విశ్వాసం చెక్కుచెదరలేదని నిరూపించాయి. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకంటే ఓ రెండు సీట్లు ఎక్కువనే కట్టబెట్టారు. అలాగే కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌ లకు కాలం చెల్లిందని మరోమారు నిరూపించారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడి మమతా బెనర్జీ ప్రజల్లో పట్టు సాధించారు. నందిగ్రామ్‌ పోరాటంతో ఆమె ప్రజల్లో మంచి నేతగా […]వివరాలు ...

జాతీయం

ఏ పార్టీ నోట చూసినా నేడు హిందూ మాటలూ, మంత్రాలే

భూమిపుత్ర,జాతీయం: దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సంతుష్టీకరణ రాజకీయాలకు సై అంటున్న నేపథ్యంలో హిందూ మత భావనల పాట ను పార్టీలు నెత్తికెత్తుకోవడంతో అయోమయంలో పడటం ప్రజల వంతైంది. భారతీయ జనతాపార్టీ ఒక సైద్దాంతిక అజెండాను ముందు పెట్టి అన్ని పార్టీలనూ ఆ ముగ్గులోకి లాగుతోంది. తన కేంద్ర స్థానమైన తామర కొలనులోకి తామరతంపరగా నేతలను లాగేసుకుంటోంది. ఇంతవరకూ గంపగుత్తగా పడే మైనారిటీ ఓట్లను నమ్ముకుంటే చాలనుకున్న రాజకీయ పక్షాలు తమ పంథా మార్చుకుంటున్నాయి. మెజార్టీ ఓటర్లు కమలం […]వివరాలు ...