Tags : ప్రభుత్వాలు

సంపాదకీయం

మహిళలపై ఆగని దాడులు

భూమిపుత్ర,సంపాదకీయం: లేడిపిల్ల ఒంటరిగా ఉంటే తోడేళ్లుపైనపడి చంపి తింటాయి. ఇక్కడ తోడేళ్ల ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే దాడి చేస్తాయి.సమాజంలోని మనిషి ముసుగు కప్పుకున్న తోడేళ్ళు బాలికలు, యువతులపై చేస్తున్న లైంగికదాడులు, ఆపై హత్యలు, నిందితులకు శిక్షలు పడకుండా రక్షించుకొస్తున్న వ్యవస్ధల దౌష్ట్యం వెరశి తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పసి కందుల నుంచి పండు ముదుసలి వరకు స్త్రీలపై జరుగుతున్న అసంఖ్యాక దారుణాలు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ‘’గుండెలపై గాయాలు, మెదడుపై దెబ్బలు, చర్మమంతా వాతలు, చితికిపోయిన శరీరం, […]వివరాలు ...

సేద్యం

ధాన్యం సేకరణే అసలు సమస్య !!

భూమిపుత్ర,వ్యవసాయం: కొందరు కారణ జన్ములు ఉంటారు. ప్రజల కోసం నిరంతరం తపించే పాలకులు పుడుతారు. మనం పాలన చేసేది ప్రజలకోసమే అన్న ఆలోచనతో ముందుకు సాగుతారు. అందుకు అనుగుణంగా పథకాలు రచిస్తారు. తమ ఆలోచనలు కార్యారూపం దాల్చేలా చేస్తారు. తన ఆలోచనలనకు పదనుపెట్టి ముందుకు నడిచి దానిని సాకారం చేసి జనం నోళ్లల్లో నానుతారు. ఔరా ఎంత మంచి నాయకుడని అనిపించుకుంటారు. పాతతరంలో నాయకులు అలానే చేసే వారు. ఎంతో త్యాగబుద్దితో ముందుకు సాగేవారు. తమ సర్వస్వం […]వివరాలు ...

సంపాదకీయం

ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వకపోతే ఎలా?

భూమిపుత్ర, సంపాదకీయం : భారత్‌లో కరోనా వైరస్‌ విసిరిన మృత్యుపాశం ఎందరో కుటుంబాల్లో విషాదం నింపింది. వేలాది కుటంబాలు తీరని విషాదంలో ఉన్నాయి. బంధువులను,అయినవారిని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. పిల్లలను ఒంటరిగా విడిచిపోయిన తల్లిదండ్రుల కారణంగా వారంతా అనాధలుగా మారారు. వారి కోసం తక్షణ కార్యాచరణ తీసుకోవాలని సుప్రీం గట్టిగానే కేంద్రాన్ని హెచ్చరించింది. నివేదిక ఇవ్వాలని కోరింది. పిఎం కేర్స్‌ నుంచి తక్షణ సాయంతో పాటు వారి భవిష్యత్‌కు భరోసా దక్కింది. ఇకపోతే లాక్‌డౌన్‌ నిబంధ […]వివరాలు ...

ఆరోగ్యం సంపాదకీయం

ముప్పుతిప్పలు పెడుతోన్న మూడు ఫంగస్ లు

భూమిపుత్ర,సంపాదకీయం : భారతదేశంపై వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇవి జీవ యుద్ధంగా కొందరు అబివర్ణిస్తున్నా వ్యాధుల సంక్రమణకు అవసరమైన అపరిశుభ్ర వాతావరణం భారతదేశంలో పుష్కలంగా ఉంది. గ్రామాలు ఇప్పుడు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. పర్యావరణం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో కరోనాకు తోడు ముప్పేటా మరో మూడు ఫంగస్‌ ల దాడి జరుగుతోంది. దీనినుంచి బయటపడడానికి ప్రజలు తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంది. కరోనా మహమ్మారి కోరల నుంచి బయటపడాలంటే అన్ని దేశాలు తమ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

వరుసగా రెండో ఏడూ మారనున్న విద్యాసంవత్సరం!!

భూమిపుత్ర ,అమరావతి: కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ మారిపోయింది. వరుసగా రెండో యేడు కూడా పిల్లలకు స్కూళ్లకు పోయే అవకాశం లేకుండా పోయింది. ప్రతీ ఏటా జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభమవుతాయి. కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ వల్ల విధించిన కర్ఫ్యూతో ఈ ఏడాది క్యాలెండర్‌ అర్థాంతరంగా ముగిసింది. దీంతో పాఠశాలు ఎప్పుడు మొదలవుతాయా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. జూన్‌ నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప పాఠశాలలు ప్రారంభించడం కుదరక పోవచ్చు. […]వివరాలు ...

సంపాదకీయం

సంక్షోభంలోనూ సరికొత్త రాజకీయ క్రీడలు

భూమిపుత్ర,సంపాదకీయం : తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న సామెత లాగా కరోనా కట్టడిని రాష్ట్రాలకు అప్పగిస్తూ చేతులు దులుపుకున్న కేంద్రం నేడు రాష్ట్రాలపై విమర్శల జడివాన కురిపిస్తోంది . కరోనా రెండవదశ గురించి కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేయలేదు సరికదా ఉత్పత్తి చేసిన వ్యాక్సీన్లను విదేశాలకు సాయంగా పంపి తన బ్రాండ్ ఇమేజీ ని పెంచుకునే ప్రయత్నాలు చేసింది. నేడు మాత్రం ప్రపంచదేశాల ముందు సాయం కోసం దేబిరించవలసిన స్థితి దాపురించింది. అంతర్జాతీయ పత్రికలు భారత్‌ నూ […]వివరాలు ...