Tags : ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పెరుగుతున్న పీఆర్సీ పరేషాన్

భూమిపుత్ర,విజయవాడ: పీఆర్సీ నివేదిక కోసం కొద్ది రోజులుగా ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్‌ ఝలక్ ఇచ్చారా? రచ్చ చేస్తున్నవారితో చర్చించకుండానే.. కీలక ప్రకటన చేసేశారా? ఆ ప్రకటన తమవల్లే సాధ్యమైందని ఉద్యోగ సంఘాల నాయకులు కాలర్‌ ఎగరేసుకోకుండా సీఎం స్ట్రాంగ్‌ స్ట్రోక్‌ ఇచ్చారా?తాడో పేడో తేల్చుకుంటాం..! ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు..! పీఆర్సీ నివేదిక ప్రకటిస్తారా లేదా అని రోడ్డెక్కి కార్యాచరణ ప్రకటించారు ఐకాసగా ఏర్పడిన ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు. […]వివరాలు ...

Uncategorized

పదవుల పటాటోపమే కానీ ప్రయోజనం శూన్యం

భూమిపుత్ర,అమరావతి: రాజకీయాల్లో నాయకులు ప్రధానంగా ఈ కిరీటాలనే కోరుకోవడం సహజం. చేతిలో పదవి ఉంటే పట్టుకుని ఊరేగవచ్చు. ఇది నేటి రాజకీయాల్లో వెలుగొందుతున్న వాస్తవం. ఇలాంటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే ఎరిక్‌ ఫ్రామ్‌ అనే సామాజిక శాస్త్రవేత్త “అధికార వాంఛ బలం నుంచి కాక బలహీనత నుంచి ఉద్భవిస్తుంది…’’ అని వ్యాఖ్యానిస్తారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గడచిన రెండున్నరేళ్లలో పలు నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడంతో ఆ పార్టీలో దాదాపు చోటా, మోటా […]వివరాలు ...

జాతీయం

ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకే!!

హెచ్చరించిన జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ( ఎన్జీటీ) భూమిపుత్ర,చెన్నై: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ( ఎన్జీటీ ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ ధిక్కరణ పిటిషన్‌ను చెన్నై ఎన్జీటీ […]వివరాలు ...

చదువు

ఇంటర్‌పరీక్షల పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

భూమిపుత్ర, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటువ్యాఖ్యలు చేసింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, దాని వల్ల ఒక్కరు మరణించినా.. కోటి పరిహారం ఇవ్వాలని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధన పాటిస్తున్నట్లు […]వివరాలు ...

సంపాదకీయం

మరో విద్యా సంవత్సరం కరోనార్పణమేనా!!

భూమిపుత్ర,బ్యూరో: వరుసగా రెండోయేడు కూడా విద్యా సంవత్సరం దెబ్బతింది ఈ యేడు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందా లేదా అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సం ప్రారంభం కావాల్సి ఉన్నా..కరోనా సెకండ్‌వేవ్‌తో ఇప్పటివరకు స్పష్టత లేదు. మహమ్మారి ఇంకా తుడిచిపెట్టుకుని పోలేదు. పరిస్థితులన్నీ బాగుండి వుంటే నేటికి నూతన విద్యా సంవత్సరం 2021-22 ప్రారంభమై వుండేది. కానీ కరోనా మహమ్మారి కారణంగా నూతన విద్యాసంవత్సరం నేటికీ ప్రారంభం కాలేదు. జూన్‌ 30వ తేదీ వరకూ […]వివరాలు ...

ఆరోగ్యం

సోమవారం నుంచి కరోనా మందు పంపిణీ !!

భూమిపుత్ర,నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య మందు కరోనా వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లోనే కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కరోనా మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. అయితే మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకి తరలించారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడవిూలో ఇకపై ఆనందయ్య మందు తయారీ కానుంది. కృష్ణపట్నంలో మందు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

రెండేళ్ళ పాలనలో రాష్ట్రం ఎటువైపు?

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: సంక్షేమ పథకాలు వేరు,తాయిలాలు వేరు.వివిధ పథకాల పేరుతో ప్రజలకు నగదు బదిలీ చేయడమన్నది వారిని ప్రలోభాలకు గురిచేయడం తప్ప మరోటి కాదు. చంద్రబాబు హయాంలోనే ఇది మొదలు అయ్యింది. నేరుగా నగదు బదిలీ చేయడం అన్న పద్దతి సరైంది కాదు.దీంతో అభివృద్ది కుంటుపడుతుంది. ఎపిలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సిఎం జగన్‌ పాలనపై ఇటీవలే ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. తాను చేస్తున్న నగదు బదిలీ చర్యలను సంక్షేమ కార్యక్రమంగా సిఎం జగన్‌ సమర్థించుకోవచ్చు.నగదు […]వివరాలు ...

తెలంగాణ

డిమాండ్లు తీరే వరకు సమ్మె కొనసాగిస్తాం

భూమిపుత్ర, హైదరాబాద్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ ( డీఎంఈ ) రమేశ్ రెడ్డితో జూనియర్ వైద్యుల ( జూడాలు ) గురువారం చర్చలు జరిపారు . అవి అసంపూర్ణంగా ముగిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వం జూడాలతో చర్చలు జరిపింది.తరువాత జూడాలు మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని తెలిపారు.ప్రభుత్వం నుంచి లిఖితపూర్వ హామీ వస్తేనే విధుల్లో చేరతామని స్పష్టంచేశారు.ప్రస్తుతానికి తమ సమ్మె కొనసాగుతుందన్నారు.విధుల్లో పాల్గొనే విషయంపై చర్చిస్తున్నట్టు చెప్పారు.” కొవిడ్ […]వివరాలు ...

రాయలసీమ

కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు

నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి పోలీసుల కన్నుగప్పి వ్యాపారాల నిర్వహణ భూమిపుత్ర , కడప : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది . కడప కార్పొరేషన్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి . దీంతో పోలీసులు నగరంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసి వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నార ఎ . జిల్లాలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా , […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

పదవతరగతి పరీక్షలపై తొలగని ప్రతిష్టంభన

తెలంగాణలో పరీక్షలు లేకుండానే ఫలితాల ప్రకటన భూమిపుత్ర , విజయవాడ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో  కర్ఫ్యూ కొనసాగుతున్న వేళ పదో తరగతి పరీక్షలు జరుగుతాయా  లేక రద్దు చేస్తారా అనే విషయంలో గందరగోళం తొలగడం లేదు . వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేక పోవడంతో విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లోనూ అయోమయం నెలకొంది . వార్షిక పరీక్షలు నిర్వహించి తీరుతామని సిఎం జగన్ , మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే […]వివరాలు ...