Tags : పంజాబ్

జాతీయం

పంజాబ్ లో పాగా వేసేందుకు బీజేపీ ప్రణాళిక

సాగుచట్టాల రద్దుతో మారిన రాజకీయ సమీకరణలు భూమిపుత్ర,ఛండీఘడ్‌: సాగుచట్టాల రద్దుతో పంజాబ్‌లో నూతనంగా రాజకీయ ఏకీకరణలు, పొత్తులకు అవకాశాలు ఏర్పడ్డాయి. బీజేపీతో పొత్తును తెంచుకుని ప్రతిష్ఠను పెంచుకున్న శిరోమణి అకాలీదళ్‌కు పెద్ద ఉపశమనం కలిగినట్లయింది. మొదట్లో వ్యవసాయ చట్టాలపై మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సులను బలపర్చి రైతాంగం నుంచి పెనువిమర్శలకు గురైన శిరోమణి అకాలీదళ్‌కు ఆ చట్టాల రద్దుతో నెత్తిన పాలు పోసినట్లయింది. ఎన్నికల లెక్కలు సరిచేసుకోవడానికి వెంపర్లాటలో అకాలీలు బహుజన్‌ సమాజ్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకొని […]వివరాలు ...

సంపాదకీయం

రైతు చట్టాల రద్దు వెనుక రహస్యం

భూమిపుత్ర,సంపాదకీయం : ఏడాదిన్నర కాలంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ ని ముట్టడించారు. ఆకలికి అలమటించారు. చలికి చనిపోయారు. లాఠీ దెబ్బలతో ఒళ్లు హూనం చేసుకున్నారు. అయినా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ విశ్రమించేది లేదంటూ రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నదంతా దేశద్రోహులంటూ, కలిస్తాన్‌ ఉగ్రవాదులంటూ ఎదురుదాడి చేశారే కానీ, రైతులను కనీసం మనుషులుగా కూడా చూడలేదు కేంద్ర పాలకులు. అలాంటిది.. ఇప్పుడు సడెన్‌గా.. కార్తీక పౌర్ణమి […]వివరాలు ...

జాతీయం

కాంగ్రెస్ చేజిక్కిన అవకాశాల్ని జారవిడుచుకుంటోందా!!

తాజా పరిణామాలతో కునుకు లేకుండా పోతున్న కాంగ్రెస్‌ భూమిపుత్ర,న్యూఢిల్లీ: పంజాబ్‌ పరిణామాలు మళ్లీ కాంగ్రెస్‌లో సెగపుట్టిస్తున్నాయి. పంజాబ్‌లో అమరీందర్‌ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి చన్నీ ప్రమాణం, సిద్దూ రాజీనామాల వ్యవహారంలో కాంగ్రెస్‌కు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌ఘడ్‌లోనూ అసమ్మతి బీజం పడింది. మొత్తంగా కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య.. ఆ పార్టీపై నమ్మకాలు సడలుతున్నాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా ఎందుకనో ఆయన ప్రచారాలకు, ప్రసంగాలకు పెద్దగా స్పందన […]వివరాలు ...

జాతీయం

పంజాబ్‌ సిఎంగా చరణ్‌జిత్‌ సంగ్‌ చన్నీ ప్రమాణం

కీలక సమయంలో కాంగ్రెస్ రణతంత్రం భూమిపుత్ర,చండీగఢ్‌: పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ చన్నీతో ప్రమాణం చేయించారు. ఆయన తర్వాత కాంగ్రెస్‌ నేతలు సుఖిందర్‌ ఎస్‌ రంధ్వానా, ఓపీ సోని ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కెప్టెన్‌ అమరీందర్‌ రాజీనామాతో ఛన్నీని కాంగ్రెస్‌ తదుపరి సిఎంగా ప్రకటించింది. దీంతో ఆయన ఉదయం ప్రమాణం చేశారు. […]వివరాలు ...

జాతీయం

సిద్దూ రాజకీయ భవితవ్యంపై అనుమానాలు!!

భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలను బిజెపి అధిష్టానం నిశితంగా గమనిస్తోన్నట్లుంది. అక్కడ సిఎం అమరీందర్‌తో మాజీ మంత్రి నవజోత్ సింగ్‌ సిద్దూకు పొసగడం లేదు. రైతుల సమస్యలను ప్రోత్సహించడం ద్వారా అమరీందర్‌ ఇటీవల వారి ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో వచ్చేయేడు పంజాబ్‌ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బిజెపి ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. సిఎం అమరీందర్‌తో ఉన్న విభేదాల కారణంగా సిద్దూ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు బిజెపికి […]వివరాలు ...