Tags : తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

మరోమారు రగులుకున్న సరిహద్దు వివాదం

ఆంధ్రప్రదేశ్ ,హైదరాబాద్‌: తెలంగాణా, ఆంధ్ర మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద ధాన్యం లారీలను అడ్డగిస్తున్నారు తెలంగాణా పోలీసులు. అర్థరాత్రి నుంచి ధాన్యం లారీలను తెలంగాణాలోకి అనుమతించడం లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఒక్క సారిగా ధాన్యం లారీలను నిలిపివేస్తే నష్టపోతామంటున్నారు వ్యాపారులు. ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న వివాదం నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ […]వివరాలు ...

సంపాదకీయం

ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడమెలా?

భూమిపుత్ర, సంపాదకీయం: కరోనా మహమ్మారితో దాపురించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పుడు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు పెద్ద కసరత్తునే చేయాల్సి వస్తోంది. భారీగా నష్టపోయిన కారణంగా కొన్ని రాష్ట్రాలు బాగా చితికిపోయాయి. దీనికితోడు ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఎక్కడినుంచి ఎలా డబ్బులు వస్తాయో తెలియడం లేదు. ప్రభుత్వాలు ఆదాయా మార్గాల్లో ఉంటే ప్రజలు కూడా అంతకు మించిన ఆపదలో ఉన్నారు. వారికి ఉపాధి మార్గాలు పోయాయి. ఉద్యోగాలు పోయాయి. కొత్తగా ఉపాధి, ఉద్యోగాల కోసం […]వివరాలు ...

తెలంగాణ

గులాబీదళం నుంచి వేరుపడ్డ ఈటెల

ఎమ్మెల్యే పదవికి, టిఆర్‌ఎస్‌కు రాజీనామా భూమిపుత్ర,హైదరాబాద్‌: పొమ్మనలేక పొగపెట్టిన కారణంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ గులాబీ దళంతో తనకున్న అనుబంధాన్ని తెంచుకున్నారు. 19 ఏళ్ల ఉద్యమ పార్టీతో ఇక సంబంధాలను వదులకున్నారు. గులాబీ బాస్‌తో పెరిగిన అంతరం కారణంగా ఆయన ఇక ఆ పార్టీలో కొనసాగనని తేల్చేశారు. అర్థంతరంగా, వివరాలు కోరకుండానే తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆగ్రహం చెందిన ఈటెల రాజేందర్‌ ఎట్టకేలకు శుక్రవారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. శుక్రవారం […]వివరాలు ...

తెలంగాణ

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ప్లాంట్లు

భూమిపుత్ర, హైదరాబాద్‌: కరోనా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మరో కీలక ముందడుగు వేసింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో మరో రెండు ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. మంగళవారం విూడియాతో మాట్లాడిన ఆమె ఇప్పటికే ఆంధప్రదేశ్‌లో నాలుగు ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా దాతలందరికీ భువనేశ్వరి పేరుపేరునా […]వివరాలు ...

తెలంగాణ

డిమాండ్లు తీరే వరకు సమ్మె కొనసాగిస్తాం

భూమిపుత్ర, హైదరాబాద్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ ( డీఎంఈ ) రమేశ్ రెడ్డితో జూనియర్ వైద్యుల ( జూడాలు ) గురువారం చర్చలు జరిపారు . అవి అసంపూర్ణంగా ముగిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వం జూడాలతో చర్చలు జరిపింది.తరువాత జూడాలు మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని తెలిపారు.ప్రభుత్వం నుంచి లిఖితపూర్వ హామీ వస్తేనే విధుల్లో చేరతామని స్పష్టంచేశారు.ప్రస్తుతానికి తమ సమ్మె కొనసాగుతుందన్నారు.విధుల్లో పాల్గొనే విషయంపై చర్చిస్తున్నట్టు చెప్పారు.” కొవిడ్ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

బీజేపీ కి కొత్త ముఖాలు కావలెను!!

భూమిపుత్ర, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజెపిది స్వయం ప్రకాశం లేని పార్టీగా ప్రజలు గుర్తించారు. ఆ పార్టీకి నాయకులు పెద్దగా లేరు. ఉన్నా వారు ప్రకాశవంతంగా ఉన్న వారు కాదు. వారి వెలుగుజాడలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రసరించడం లేదు. అలాగే నరేంద్రమోడీ, అమిత్‌ షా ల ప్రభావం కూడా ఇక్కడ అంతగా పనిచేయలేదు. మొన్నటి బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీని మూడు చెరువుల నీళ్లు తాగించి, ఆమె పార్టీకి చెందిన అనేకులను తమ పార్టీలో […]వివరాలు ...

తెలంగాణ

తెలంగాణను బెంబేలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్!!

భూమిపుత్ర,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ను ఎపిడమిక్‌ యాక్ట్‌ 1897 ప్రకారం నోటిఫైబుల్‌ (ప్రత్యేకంగా గుర్తించదగిన) వ్యాధిగా వైద్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించేందుకు స్క్రీనింగ్‌తో పాటు వివిధ రకాల డయగ్నోస్టిక్స్‌ను ఉపయోగించాలని ఆరోగ్యశాఖ సూచించింది. కేసు తేలిన వెంటనే వైద్యశాఖకు తప్పనిసరిగా చెప్పాలని పేర్కొంది. అంతేగాక ఆయా జిల్లాల వారీగా నమోదవుతున్న కేసులను ఆయా మెడికల్‌ సూపరింటెండెంట్లు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

కరోనా వేళ కనిపించని నేతాశ్రీలు

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: ఓట్ల కోసం గల్లీ గల్లీ తిరిగిన రాజకీయ నేతలు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు కరోనా సంక్షోభంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా వారిని కలవడానికి ముఖం చాటేస్తున్నారన్న అపవాదూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాను ఎత్తిచూపే బాధ్యత కలిగిన ప్రతిపక్షాలు ఎందుకు కనిపించడం లేదన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. కరోనా పరిస్థితులల్లో ప్రజలను కలవలేకపోతున్నామంటూ నిబంధనలను సాకుగా చూపుతున్నాయి.ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు,మార్చిలో మున్సిపల్ ఎన్నికలు, నిన్నగాక […]వివరాలు ...