Tags : చట్టాలు

సంపాదకీయం

మహిళలపై ఆగని దాడులు

భూమిపుత్ర,సంపాదకీయం: లేడిపిల్ల ఒంటరిగా ఉంటే తోడేళ్లుపైనపడి చంపి తింటాయి. ఇక్కడ తోడేళ్ల ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే దాడి చేస్తాయి.సమాజంలోని మనిషి ముసుగు కప్పుకున్న తోడేళ్ళు బాలికలు, యువతులపై చేస్తున్న లైంగికదాడులు, ఆపై హత్యలు, నిందితులకు శిక్షలు పడకుండా రక్షించుకొస్తున్న వ్యవస్ధల దౌష్ట్యం వెరశి తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పసి కందుల నుంచి పండు ముదుసలి వరకు స్త్రీలపై జరుగుతున్న అసంఖ్యాక దారుణాలు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ‘’గుండెలపై గాయాలు, మెదడుపై దెబ్బలు, చర్మమంతా వాతలు, చితికిపోయిన శరీరం, […]వివరాలు ...

జాతీయం

వ్యవస్థల వైఫల్యంపై సుప్రీం విసుర్లు

భూమిపుత్ర,సంపాదకీయం: వ్యవస్థల అలసత్వాన్ని,వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు బూజు దులిపే పనిలో పడింది. ఒక్కో విషయంలో సుప్రీం ధర్మాసనం ఇస్తున్న సూచనలు, హెచ్చరికలు.. .బూజుపట్టిన రాజకీయ వ్యవస్థ తీరును రుజువు చేస్తున్నాయి. ఎంతోకాలంగా పాలకులు తమకు అనుకూలంగా చట్టాలను చేసుకుని..చట్టాలను తమ చుట్టాలుగా చేసుకుని అధికారులను మచ్చిక చేసుకుని పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఎదుటివారి విూదకు ఉసిగొలిపే కాపలా కుక్కగా చేసుకుని రాజ్యం ఏలుతున్న తీరు మెల్లగా విమర్శలకు గురవుతోంది. బెయిల్‌ రద్దులతో మొదలైన […]వివరాలు ...

జాతీయం

చర్చలు లేకుండానే చట్టాలు చేయడం దురదృష్టకరం

సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆవేదన సుప్రీకోర్టులో జాతీయ జెండా ఆవిష్కరణ భూమిపుత్ర, న్యూ ఢిల్లీ: పార్లమెంట్‌ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడారు. ఈ సందర్భంగా […]వివరాలు ...