Tags : కరోనా

జాతీయం

ప్రజలను కష్టాల్లోకి నెట్టిన ఏడేళ్ల పదవీయోగం!!

భూమిపుత్ర,సంపాదకీయం: ప్రధానిగా మోడీ ఏడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.మరో మూడేళ్లు ఆయన ఈ పదవిలో ఉంటారు.అలాగే గతంలో గుజరాత్ సిఎంగా మూడు దఫాలు అధికారాన్ని అనుభవించారు.అయితే కరోనా కష్టకాలంలో బిజెపి నేతలు,శ్రేణులు ఈ ఏడేళ్ల ఉత్సవాలను ఎక్కడా ప్రస్తావించడం కానీ,పండగలు చేసుకోవడం కానీ జరగలేదు.కరోనా కష్టకాలం కావడంతో కొంత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.లేకుంటే ఎన్నికలు నిర్వహించినట్లుగా ఊరూవాడా బ్యాండ్ బాజా మోగించేవారు.అయితే దేశంలో ఇంత సుదీర్ఘ కాలం ఉన్నత పదవులు అధిష్టించిన మోడీ […]వివరాలు ...

రాయలసీమ

కర్ఫ్యూ నిబంధనలు బేఖాతరు

నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైకి పోలీసుల కన్నుగప్పి వ్యాపారాల నిర్వహణ భూమిపుత్ర , కడప : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది . కడప కార్పొరేషన్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి . దీంతో పోలీసులు నగరంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసి వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నార ఎ . జిల్లాలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా , […]వివరాలు ...

వ్యాపారం

పంట పండుతోన్న పాత కార్ల వ్యాపారం

భూమిపుత్ర, బిజినెస్: కరోనా తగ్గుముఖం పట్టాక పాతకార్ల బిజినెస్‌ తప్పక పుంజుకుంటుందని ఆటోమొబైల్ కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. వైరస్‌ సోకుతుందనే భయంతో చాలా మంది బస్సుల్లో ప్రయాణాలకు జంకుతున్నారు. సొంత కార్లలోనే వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. కొత్తవి కొనడం సాధ్యం కాని వాళ్లు సెకండ్‌హ్యాండ్‌ కార్లవైపు చూస్తున్నారని డీలర్లు అంటున్నారు. మారుతి, మహీంద్రా, టొయోటా పాత కార్ల వ్యాపారంపై సానుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం అమ్మకాలు లేకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో సేల్స్‌ పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అంచనాలు చెప్పడం మాత్రం కష్టమని […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ప్రముఖ విద్యావేత్త, మాజీ విసి సింహాద్రి కన్నుమూత

భూమిపుత్ర,కాకినాడ: ప్రముఖ విద్యావేత్త, ఆచార్య యెడ్ల సింహాద్రి కన్నుమూశారు. కరోనా సోకడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండం కామినిలంకకు చెందిన సింహాద్రి.. ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్‌, బీహార్‌ వంటి విశ్వ విద్యాయాల్లో వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.వివరాలు ...

రాయలసీమ

కరోనా కర్ఫ్యూ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం

సడలింపు సమయంలో గుంపుగా వీధుల్లో ప్రత్యక్షం ఇలాగే ఉంటే కేసులు తగ్గవంటున్న అధికారగణం భూమిపుత్ర,అనంతపురం: కరోనా మహమ్మారి కట్టడికోసం ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. వరుసగా పెరుగుతున్న పాజిటివ్ లు, మరణాల సంఖ్యను చూస్తుంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గకపోగా మరింత పెరుగు తున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగు తుండటం ఆందోళన […]వివరాలు ...

తెలంగాణ

తెలంగాణను బెంబేలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్!!

భూమిపుత్ర,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ను ఎపిడమిక్‌ యాక్ట్‌ 1897 ప్రకారం నోటిఫైబుల్‌ (ప్రత్యేకంగా గుర్తించదగిన) వ్యాధిగా వైద్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించేందుకు స్క్రీనింగ్‌తో పాటు వివిధ రకాల డయగ్నోస్టిక్స్‌ను ఉపయోగించాలని ఆరోగ్యశాఖ సూచించింది. కేసు తేలిన వెంటనే వైద్యశాఖకు తప్పనిసరిగా చెప్పాలని పేర్కొంది. అంతేగాక ఆయా జిల్లాల వారీగా నమోదవుతున్న కేసులను ఆయా మెడికల్‌ సూపరింటెండెంట్లు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఆనందయ్య మందుతో దుష్ఫలితాలు రాలేదు

ఎందరో మందు తీసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు-కాకాణి భూమిపుత్ర, నెల్లూరు: ఇప్పటికే వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని, ఎక్కడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని కరోనా బాధితులు చెబుతున్నారన్నారు. వేల మంది రావడం వల్ల ఇబ్బంది కలుగుతోందని, ఈరోజు సాయంత్రం ఐసీఎంఆర్‌ బృందం నెల్లూరుకి చేరుకుంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ […]వివరాలు ...

జాతీయం

చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్‌ బహుగుణ కన్నుమూత

కరోనా బారిన పడి వృద్ధాప్యంలో మృతి ప్రధాని మోడీ తదితర ప్రముఖుల సంతాపం భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: ప్రఖ్యాత పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ కన్నుమూశారు. కోవిడ్‌19 వ్యాధితో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఆయన కోవిడ్‌ చికిత్స పొందారు. మధ్యాహ్నం 12.05 నిమిషాలకు బహుగుణ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్‌ డైరక్టర్‌ రవికాంత్‌ తెలిపారు. కరోనా పాజిటివ్‌ తేలడంతో మే 8వ తేదీన ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. గత […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

ప్రజలు పిట్టల్లా రాలుతున్నా రాజకీయాలేనా!!

భూమిపుత్ర,సంపాదకీయం: దేశంలో  కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్యమాత్రం తగ్గడం లేదు. అధికారికంగా లెక్కలు ఒకలా ఉంటే వాస్తవ గణాంకాలు వేరుగా ఉన్నాయి. వాక్సిన్‌ అందరికీ అందుబాటులో రాలేదు. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడింది . వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కార్యరూపం దాల్చలేదు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకల విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.హామీలు శుష్క వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయి. ఆక్సిజన్‌ అందక వందలాది […]వివరాలు ...

ఆరోగ్యం

రెండోదశలో చికిత్సలో ఇబ్బందులు

తొలిదశ వైద్యం తీసుకున్న వారిపై పరిశోధనలు లాన్సెట్‌ జర్నల్‌ అధ్యయనంలో వెల్లడి భూమిపుత్ర,న్యూ ఢిల్లీ: తొలి దశ కోవిడ్‌ సమయంలో ఇంటి వద్దే వైద్యం పొందిన వారిలో రెండోదశ కోవిడ్‌ ప్రభావం అంతగా కనిపించడం లేదని తాజా పరిశోధనలు వ్లెడిస్తున్నాయి. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లక తప్పని వారిలోనే రెండో దశ కోవిడ్‌ అనేక సమస్యలకు కారణమవుతోంది. అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గతేడాది మొదటి దశ కోవిడ్‌ సమయంలో […]వివరాలు ...