Tags : ఐరోపా దేశాలు

ప్రపంచం సంపాదకీయం

ఐరోపా దేశాలను వణికిస్తున్న కరోనా

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా వైరస్ తన విజృంభణ ను ఇప్పట్లో చాలించేలా కనిపించడంలేదు. మహమ్మారి మరోమారు యూరప్‌ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అక్కడక్కడా పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా సాగుతున్నాయి. చైనాలో సైతం కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలోనూ లెక్కలోకి రాని కేసులు, మరణాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గించి చూపిస్తున్నారు. ఎలాంటి ఉధృతి లేకుండా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి, రెండో వేవ్‌ల కంటే వేగంగా థర్డ్‌వేవ్‌ ఉండబోతోందన్న భయం పాశ్చాత్య దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. […]వివరాలు ...

ప్రపంచం

డ్రాగన్ ఆగడాలపై గుర్రుగా ఉన్న నాటో దేశాలు

భూమిపుత్ర, అంతర్జాతీయం: రష్యాతో కలసి చైనా తన సైన్యాన్ని ఆధునీకరించుకోవడం, అణ్వా యుధాలను సమకూర్చుకుంటూ తమతో పోటీపడాలని చూస్తే ఊరుకునేది లేదని సంపన్న దేశాల ఆధ్వర్యంలోని సైనిక కూటమి నాటో హెచ్చరించింది. సోమవారం నాడిక్కడ జరిగిన నాటో నేతల సమావేశంలో ఈ కూటమి అధిపతి జీన్స్‌ స్టాల్టెన్‌బర్గ్‌ మాట్లాడుతూ, మిలిటరీ, రక్షణ సాంకేతిక పరిజ్ఞాన పరంగా నాటోకు సరి సమంగా బలం పెంచుకోవాలని చైనా యత్నిస్తోందని, దీనిని తాము ఎంతమాత్రం సహించబోమని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం […]వివరాలు ...