Tags : అధికారులు

జాతీయం

వ్యవస్థల వైఫల్యంపై సుప్రీం విసుర్లు

భూమిపుత్ర,సంపాదకీయం: వ్యవస్థల అలసత్వాన్ని,వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు బూజు దులిపే పనిలో పడింది. ఒక్కో విషయంలో సుప్రీం ధర్మాసనం ఇస్తున్న సూచనలు, హెచ్చరికలు.. .బూజుపట్టిన రాజకీయ వ్యవస్థ తీరును రుజువు చేస్తున్నాయి. ఎంతోకాలంగా పాలకులు తమకు అనుకూలంగా చట్టాలను చేసుకుని..చట్టాలను తమ చుట్టాలుగా చేసుకుని అధికారులను మచ్చిక చేసుకుని పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఎదుటివారి విూదకు ఉసిగొలిపే కాపలా కుక్కగా చేసుకుని రాజ్యం ఏలుతున్న తీరు మెల్లగా విమర్శలకు గురవుతోంది. బెయిల్‌ రద్దులతో మొదలైన […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ జాతీయం

నీరుగారుతున్న సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు చట్టం అమలయ్యి నేటితో 16 ఏళ్ళు భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: చట్టం -నేపథ్యం: ప్రభుత్వ పరిపాలనలో ఏమిజరుగుతుందో ప్రజలు తెలుసుకునేందుకు వచ్చిన చట్టం సమాచార హక్కు చట్టం-2005. పరిపాలనలో పారదర్శకత పెంపొందించడంద్వారా ప్రజలకు జవాబుదారీతనం పాలకులకు పెరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలెవరూ కోరకుండానే ప్రతి ప్రభుత్వ కార్యాలయం స్వచ్ఛందంగా వెల్లడించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం క్రింద ప్రతి సంవత్సరం సుమారు 40 నుండి 60 లక్షల దరఖాస్తులు దాఖలు చేయబడుతున్నాయి. […]వివరాలు ...

రాయలసీమ

మరణ ధృవీకరణ పత్రాల మంజూరు లో ఆలస్యం

భూమిపుత్ర,అనంతపురం: కరోనా మరణాలపై స్పష్టత లేకుండా పోతోందన్నది. కరోనాతో పోయినా సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రతిరోజూ ఏదోచోట కరోనా మరణాలు సంభవిస్తున్నా అధికారులు ధృవీకరించడం లేదు. దీంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం కరువవుతోంది. కొవిడ్‌ లక్షణాలతో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా అది అమలు కావడం లేదు. మృతుల వివరాలతో పాటు కరోనాతో మృతిచెందినట్టు ధ్రువీకరణ పత్రం జత చేసి దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం అందజేస్తామని […]వివరాలు ...

సేద్యం

సబ్సిడీ వేరుశనగ విత్తనాలకు రైతులు దూరం

భూమిపుత్ర,అనంతపురం: ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన సబ్సిడీ వేరుశనగ విత్తనాల పట్ల రైతుల్లో అనాసక్తి వ్యక్తం అవుతోంది. నలభై శాతం రాయితీ ఇచ్చాక కూడా రైతులు నికరంగా తమ జేబుల్లో నుండి పెట్టుకోవాల్సిన సొమ్ము కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)తో సమానంగా ఉండటం, నాణ్యత లేమి, తమ పంటను తమకే విత్తనాలుగా ఇవ్వడం, ఒక్కో రైతుకు గరిష్టంగా నాలుగు బదులు మూడు మూటల కాయలే ఇవ్వడం, కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ఉధృతి, ఇత్యాది […]వివరాలు ...

రాయలసీమ

కరోనా కర్ఫ్యూ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం

సడలింపు సమయంలో గుంపుగా వీధుల్లో ప్రత్యక్షం ఇలాగే ఉంటే కేసులు తగ్గవంటున్న అధికారగణం భూమిపుత్ర,అనంతపురం: కరోనా మహమ్మారి కట్టడికోసం ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. వరుసగా పెరుగుతున్న పాజిటివ్ లు, మరణాల సంఖ్యను చూస్తుంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గకపోగా మరింత పెరుగు తున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరుగు తుండటం ఆందోళన […]వివరాలు ...

రాయలసీమ

కరోనా పరీక్షల కోసం క్యూలు కడుతున్న జనం

భూమిపుత్ర, అనంతపురం: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో  ఏ చిన్న లక్షణం కనిపించినా ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వైద్య సిబ్బంది వారి నుంచి శాంపిళ్లు సేకరిస్తున్నారు. రోజుకు అధికారిక లెక్క మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు పదివేలకు పైగా నమూనాలు సేకరిస్తున్నారు. సేకరించిన నమూనాలను ఐడీలు సృష్టించి సమాచారాన్ని పొందుపరచి ప్రయోగశాలకు వెంటనే తరలించినట్లయితే ఫలితాలు కూడా అంతే తొందరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. వెంటనే ఆసుపత్రిలో చేరిపోయి వైద్యుల […]వివరాలు ...