శ్రీ శైలంలో ఉదయం ఆరునుంచి పదకొండు గంటల వరకే దర్శనాలు

 శ్రీ శైలంలో ఉదయం ఆరునుంచి పదకొండు గంటల వరకే దర్శనాలు

భూమిపుత్ర, శ్రీశైలం:
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నామని, పరోక్ష సేవలను భక్తులు దేవస్థానం ఛానల్లో వీక్షించవచ్చని పేర్కొన్నారు. దేవస్థాన పరిపాలనా విభాగంతోపాటు అర్చక పండితుల్లో ఇప్పటికే చాలామంది కొవిడ్‌ బారిన పడ్డారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల సిబ్బంది అత్యవసరమైతేనే కార్యాలయాలకు రావాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

శ్రీశైల మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఈఓ కేఎస్.రామారావు

శ్రీశైలం సీఐ వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించినందున అనవసరంగా రోడ్లపై తిరిగితే జాతీయ విపత్తుల నివారణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అత్యవసరంగా వైద్య సేవల కోసం వెళ్లే వారు, ఆలయ ప్రధాన సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మినహా ఎవరూ బయట తిరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉపేక్షించేది లేదన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *