సిక్కుమత స్థాపకుడు గురునానక్‌

 సిక్కుమత స్థాపకుడు గురునానక్‌

నేడు ఆయన జయంతి సందర్భంగా..
భూమిపుత్ర, సాంస్కృతికం:
భారత ఆధ్యాత్మిక వేత్త సిక్కు మత వ్యవస్థాపకుడు అయిన గురునానక్‌ 1469 ఏప్రిల్‌ 15వ తేదీన జన్మించారు. ఉమ్మడి భారతదేశంలోని ప్రస్తుత పాకిస్తాన్‌ లో ఉన్న నాన్కాన సాహిబ్‌ లో జన్మించిన ఈయన… పది మంది సిక్కు గురువులో మొదటి వాడు. హిందూ ఇస్లాం మతం గ్రంధాలు చదివిన గురు నానక్‌ దేవ్‌… రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించాడు. సిక్కు మత స్థాపకులలో ఉన్న గురు నానక్‌ ఏకేశ్వరోపాసన సమర్దించి కుల వ్యవస్థను వ్యతిరేకించిన గురువు. ఈయన తర్వాత గురు పరంపర కొనసాగింది. గురునానక్‌ చిన్నతనం నుంచే ప్రశ్నించి ఆలోచించే తత్వంతో ఉండేవాడు. చిరు వయస్సులోనే మతపరంగా ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం కూడా తిరస్కరించారు గురు నానక్. సత్యం, అహింసతో కూడిన మార్గంలో నడవాలని గురునానక్‌ చాటిచెప్పారు, ఈయన బోదించిన కొన్ని ముఖ్య ఉపదేశాలు
ఓంకారంలా ఈశ్వరుడు ఒక్కడే. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. మనందరికీ ఆయనే తండ్రి. అందుకే అందరితో ప్రేమ పూర్వకంగా మెలగాలని ప్రబోధించాడు. తనలోని లోభ గుణాన్ని తరిమికొట్టి, కష్టించి పనిచేయాలి. న్యాయపరమైన విధానంలోనే ధనాన్ని ఆర్జించాలి. అప్పుడైనా, ఎవరి హక్కునైనా హరించడం తగదు. నీతిగా, నిజాయితీతో సంపాదన సాగిస్తూ, అర్హులను ఆదుకుంటుండాలి. డబ్బు అనేది జేబు వరకు మాత్రమే ఉండాలి. అది మన హృదయాన్ని తాకకుండా చూసుకోవాలి. అలా జరిగితే సమస్యలు చుట్టుముడతాయి. మహిళలను గౌరవించాలి. స్త్రీ, పురుషులిద్దరూ సమానులే. మానసిక వ్యాకులతను విడిచిపెట్టి, నిరంతరం కర్మను చేస్తుండాలి. నిత్యం ప్రసన్నంగా ఉండాలి. బాహ్య ప్రపంచంలో గెలిచేముందు మనలోని దుర్గుణాలను తొలగించుకోవడం ఎంతో ముఖ్యం. అహంకారమే మనుషులకు అతిపెద్ద శత్రువు. అందుకే ఎప్పుడూ అహంకారానికి లోనుకాకూడదు. వినయం, సేవాభావాతో జీవితాన్ని గడపాలి. ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సోదరభావం, ఆధ్యాత్మిక చింతన మొదలైన సందేశాలను తోటివారికి అందించాలని బోధించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *