భూమిని పరిరక్షించుకోకపోతే భావితరాలు మనుగడ సాగించలేవు

 భూమిని పరిరక్షించుకోకపోతే భావితరాలు మనుగడ సాగించలేవు

ధరిత్రి దినోత్సవం

ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం
భూమిపుత్ర,పర్యావరణం:
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి.భూమితో సంబంధం లేని మానవుడు ఉండరంటే అతిశయోక్తి గాదు.అలాంటి ధరాతల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించ కుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం. అటు పర్యావరణం, వాతావరణం తో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరం అవుతున్నాయి.అందులో భాగంగానే తొలి ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే)ను 1970 ఏప్రిల్ 22న జరుపుకున్నారు. అప్ప‌టి నుంచి ఏటా అదే రోజు ధ‌రిత్రి దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాం. పారిశ్రామీకరణ వల్ల పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణం గురించి మన అజాగ్రత్త మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని అమెరికన్ సెనెటర్ గేలార్డ్ నెల్సన్ ‘ఎర్త్ డే’కు రూపకల్పన చేశారు.తొలి ఎర్త్‌డే (1970) రోజు అమెరికా వీధుల్లో వేలాది మంది పారిశామ్రిక విప్లవానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.‘ఎర్త్ డే నెట్‌వర్క్స్ ఇండియా ప్రోగ్రాం’ ప్రధాన కేంద్రం కోల్‌కతాలో ఉంది. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, వుమెన్ అండ్ ది గ్రీన్ ఎకానమీ, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్… మొదలైన విభాగాలలో ఈ సంస్థ పనిచేస్తుంది.భూమి మీద రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని లక్షల సంవత్సరాల భూమి చరిత్రలో ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అధికం.420 కోట్ల సంవత్సరాల భూగోళం గత 300 సంవత్సరాలలో గుడ్డిగా అభివృద్ధి పేరుతో చేసిన భీభత్సం కారణంగా రాబోయే 80 సంవత్సరాలలో బూడిద కాబోతోంది.ఈ భూమి మీద ఉన్న సమస్త మానవజాతి అంతరించిపోతుంది, 2100 కల్లా ఈ భూమి మీద మానవుడు బ్రతికే పరిస్థితి ఉండదని పరిశోధనలు నోక్కి చెప్తున్నాయి.మనం చేసే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ (భూతాపం)కు కారణమవుతోంది. సమస్త భూగోళం వినాశనం దిశగా అడిగులేస్తోంది.మన వారసులకు మనం చక్కటి ఆహ్లాదకరమైన భూమిని ఇవ్వవలసింది పోయి, శ్మశానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఇస్తే వాళ్ళు స్వీకరిస్తారా? భూగోళాన్ని పరిరక్షించే చర్యలకు ఎందుకు చేపట్టలేదని మనల్ని తిరిగి ప్రశ్నిస్తే? మనమేం సమాధానం ఇస్తాం?
    ఏప్రిల్ 22, ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తోంది..
మిగతా దేశాలకంటే భారతీయులకు భూమితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. మన సంస్కృతి మనకు నేర్పింది పర్యావరణ పరిరక్షణే. మన భూగోళాన్ని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడదాం.ఈ ఏడాది ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ధరిత్రీ పర్యావరణ పరిరక్షణకు మన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారా అయితే, పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమీ తీసుకోనక్కరలేదు.
మన రోజువారీ అలవాట్లు, కార్యక్రమాల్లో కొన్నింటిని మార్పు చేసుకుంటే చాలు. అవి తెలుసుకోండి.
 బయటికెళ్ళేందుకు కారును కాకుండా నడిచి వెళ్ళడం లేదా బైక్‌ రైడింగ్‌ను ఎంచుకోండి. పలుమార్లు కారులో ప్రయాణించకుండా ఇతరులతో కలిసి పనులు పంచుకోండి.మాంసాహారానికి దూరంగా ఉండండి. తద్వారా కార్బన్‌ ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించండి. పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగిం చండి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించండి. పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్‌ బాటిల్స్‌, బ్యాగ్‌లనే ఉపయోగించండి. అవసరం లేనప్పుడు విద్యుత్‌ బల్బులను ఉపయోగించద్దు. బిల్లులను తీసుకోవడం, కట్టడం ఆన్‌లైన్‌లోనే చేయండి. స్థానిక మార్కెట్‌లోనే షాపింగ్‌ చేయండి, స్థానికంగా దొరికే ఆహారాన్నే వినియోగించండి సాధ్యమైనంత వరకూ రీసైక్లింగ్‌కు అవకాశం ఉండే వస్తువులనే ఉపయోగించండి. డిస్పోజబుల్‌ ప్యాకేజీలకు దూరంగా ఉండండి
మన ఇంట్లో, చుట్టుపక్కల పరిసరాల్లో భూగోళ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా మానవాళి పురోగమన చర్యలకు తోడ్పడండి. ధరిత్రి పరిరక్షణకు స్ఫూర్తిని పెంచుకోండి.
“రండి మన భూమిని మనమే కాపాడుకుందాం”..!!

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *