”రామసక్కనోళ్లు” చిత్రం నవ్విస్తూనే ఉద్వేగానికి లోను చేస్తుంది -చమ్మక్ చంద్ర

 ”రామసక్కనోళ్లు” చిత్రం  నవ్విస్తూనే ఉద్వేగానికి లోను చేస్తుంది -చమ్మక్ చంద్ర

భూమిపుత్ర,సినిమా:
చమ్మక్‌చంద్ర, మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రామసక్కనోళ్లు’. ఫహీమ్‌ సర్కార్‌ దర్శకుడు. రమణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తుమ్ముల ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చమ్మక్‌చంద్ర మాట్లాడుతూ ‘రామసక్కనోళ్లు నలుగురు కుర్రాళ్ల కథ. ఊరి బాగు కోసం వారు ఎలాంటి పోరాటం చేశారన్నది ఆకట్టుకుంటుంది. నవ్విస్తూనే ఉద్వేగానికి లోను చేస్తుంది. ఘంటాడి కృష్ణ సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది. వందశాతం వినోదాన్ని పంచుతుంది. అందరికి నచ్చే సినిమా అవుతుందని తెలిపారు. చమ్మక్ చంద్ర, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ధనరాజ్ తదితరుల భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది, త్వరలో ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాము అన్నారు. నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ రామసక్కనోళ్లు సినిమా టైటిల్ బాగుంది, సినిమా కూడా అంతే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించి నిర్మాత దర్శకులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు నటించిన ఈ సినిమా వినోదం పంచాలని కోరుకుంటున్న అన్నారు. కథానాయిక మేఘన చౌదరి మాట్లాడుతూ రామసక్కనోళ్లు సినిమా చాలా బాగా వచ్చింది. ఒక మంచి ప్రాజెక్ట్ లో నటించినందుకు సంతోషంగా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న మా సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నారు అన్నారు.

నటీనటులు:
చమ్మక్‌ చంద్ర, సలీం షేక్‌ హీరోలుగా నటిస్తున్నారు. మేఘనా చౌదరి, షియాజీ షిండే, బ్రహ్మానందం, నాగినీడు, చలపతి , రఘుబాబు, బ్రహ్మాజీ, అప్పారావు, సుమన్‌శెట్టి, చిత్రం శ్రీను, సుధీర్‌, బాబుసింగ్‌క్రియేటివ్‌ డైరక్టర్‌: చెన్నమాధవుని కార్తికేయన్‌రాజు
కో`డైరక్టర్‌: రాంబాబు, సంగీతం:ఘంటాడి కృష్ణ డిఓపి:జగన్‌ రైటర్స్‌:సాహితిరత్న, ఎడవల్లి, ప్రభాకర్‌, అంబట్ల నిర్మాతలు: రమణ, సతీష్‌ కుమార్‌ సాత్పడి, దర్శకత్వం:ఫహీం సర్కార్‌.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *